Viral: తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడి కత్తి.. అసలు ట్విస్ట్ ఇది..?

|

Oct 18, 2024 | 3:32 PM

తవ్వకాల్లో కుంభకర్ణుడు వాడిన కత్తి బయటపడింది అంటూ నెట్టింట కొన్ని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది ఎక్కడ బయటపడింది... అసలు ఈ ఫోటోలు నిజమైనవేనా..? పూర్తి డీటేల్స్ తెలుసుకుందాం పదండి....

Viral: తవ్వకాల్లో బయటపడ్డ కుంభకర్ణుడి కత్తి.. అసలు ట్విస్ట్ ఇది..?
Follow us on

ఏఐ వచ్చిన తర్వాత డీప్ ఫేక్ వీడియోలు పెరిగిపోయాయి. ఏది నిజమో, ఏది కాదో.. తెలుసుకోవడం క్లిష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే కొందరు ఫేక్‌గాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ రకాల కంటెంట్ ఏఐ ద్వారా మార్ఫింగ్ చేసి జనాల్లోకి వదులుతున్నారు. సామాన్య జనం.. ఆ వార్తలు నిజమైనవిగా భావిస్తున్నారు. వాస్తవానికి ఫేక్‌ వీడియోలు, మార్ఫింగ్‌ వీడియోల సమస్య కొత్త కాదు. అయితే మార్ఫింగ్ చేయడానికి ఉన్న సాంకేతికతకు మించిన సాఫ్ట్‌వేర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత యాప్‌లు ఇప్పుడు ఎక్కువయ్యాయి. AI..ఆధునిక బ్రహ్మగా అభివర్ణిస్తోంది నేటి ప్రపంచం. ఆర్టిఫిషియల్ టెక్నాలజీతో చచ్చినవాళ్లను బతికిస్తుంది. వారితో మాట్లాడిస్తుంది. డాన్సులేయిస్తుంది. పాటలు పాడిస్తుంది. అయితే డీప్ ఫేక్ వీడియోలతో సోషల్ మీడియాను భ్రష్టు పట్టిస్తూ.. ప్రజలను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు కొందరు.

తాజాగా రావణుని సోదరుడు కుంభకర్ణుడు వాడిన కరవాలం నిపుణులు పరిశోధనలో తవ్వకాలలో దొరికిందని.. అది రామాయణం కాలం నాటిది అని చెప్తూ పలు రకాల ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలామంది నిజమైనదిగా భావించి.. ఆ ఫోటోలు, వీడియోలను నెట్టింట సర్కులేట్ చేస్తున్నారు. దీని వెనక ఉన్న నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేసింది టీవీ9.

అసలు ఇంత పెద్ద కత్తి తవ్వకాల్లో లభ్యమైతే.. అది అతి ప్రాచీనమైనది అయితే కేంద్ర ప్రభుత్వం లేదా పురావస్తు శాఖ కచ్చితంగా ప్రకటన విడుదల చేస్తోంది. అలాంటి ప్రకటన ఏం రాలేదు. ఆ తర్వాత రీసెర్చ్‌లో ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడి తయారు చేసినవిగా తేటతెల్లమైంది.  ‘TrueMedia.org, ‘Maybe’s AI Art Detector’ వంటి టూల్స్ ద్వారా చెక్ చేయగా.. ఈ ఫోటోలు ఏఐ ద్వారా రూపొందించినవే అని రిపోర్ట్ చేశాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..