Viral Video: చీమలను చాలామంది తక్కువగా అంచనా వేస్తుంటారు. అయితే ‘బలవంతమైన సర్పము.. చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ’ అని సుమతీ శతకంలో చెప్పినట్లు చీమలకు కూడా చాలా బలం ఉంటుంది. ఒక్కోసారి అవి చేసిన పనులు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాంటిదే ఇది కూడా. ఎందుకంటే ఈ చిన్న చీమలు ఏకంగా బంగారపు గొలుసు కొట్టేశాయి. వినడానికి కాస్త వింతగా ఉన్నా కూడా ఇది నిజమే. కొన్ని చీమలు కలిసి ఒక బంగారం చైన్‌ను ఎత్తుకెళ్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ప్రముఖ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద పోస్టు చేసిన ఈ వీడియోలో కొన్ని చీమలు కలిసి ఒక బంగారపు గొలుసును నెమ్మదిగా ఎత్తుకెళ్లిపోతున్నాయి.
చక్కెర ఇచ్చి చైన్ తీసుకుందాం..
సాధారణంగా చీమలు పంచదార, పప్పులను దొంగతనం చేస్తాయి. అయితే అవి ఏకంగా బంగారు చైన్‌ను ఎత్తుకెళ్లాయి. ఈక్రమంలో పదుల సంఖ్యలో గోల్డ్ చైన్‌ను ఎత్తుకెళ్తున్న చీమలకు సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసిన సుశాంత నంద..’బుల్లి గోల్డ్ స్మగ్లర్లు.. ఇక్కడ ప్రశ్నేంటంటే.. ఈ చీమలపై ఐపీసీలోని ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి?’ అని నెటిజన్లను అడిగారు. ఐఎఫ్‌ఎస్ అధికారి ట్వీట్‌కు నెటిజెన్లు కూడా అదే రీతిలో స్పందిస్తున్నారు. ‘చీమలపై పెట్టాల్సింది ఐపీసీ సెక్షన్ కింద కాదు, ఏపీసీ (యానిమల్ పీనల్ కోడ్)’ అంటూ ఒకరు స్పందించారు. చీమల దొంగనతం వెనకున్న మాస్టర్‌మైండ్‌ను అర్థం చేసుకోవాలని మరొకరు కామెంట్ చేయగా .. చీమలకు కొంత పంచదార ఇచ్చి గోల్డ్ చైన్‌ను తీసుకుందాం’ అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు. మరికొందరేమో ఈ చీమలన్నీ కలిసి మరోసారి ఐకమత్యం బలాన్ని చూపించాయని మెచ్చుకుంటున్నారు.
Tiny gold smugglers ??
The question is,under which section of IPC they can be booked? pic.twitter.com/IAtUYSnWpv— Susanta Nanda IFS (@susantananda3) June 28, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..