కిలేడీ..! రూపాయి కట్టకుండా.. 15 రోజులు ఫైవ్ స్టార్ హోటల్లోనే.. స్పా సహా లగ్జరీ సేవలు..

|

Jan 18, 2024 | 11:47 AM

హోటల్‌ లో ఉంటూ కావాల్సిన ఫుడ్‌, డ్రింక్స్‌, స్పా వంటి అన్ని సదుపాయాలకు గానూ UPI ద్వారా ఆమె చెల్లిస్తున్నట్టుగా నకిలీ మెసేజేస్‌ చూపించినట్టుగా హోటల్‌ సిబ్బంది ఆరోపించారు. అయితే ఆ మొత్తం హోటల్ బ్యాంక్ ఖాతాలోకి వెళ్లలేదని చెప్పారు. 15 రోజులుగా డబ్బులు జమ కాకపోవటంతో..ఇదేంటని హోటల్ సిబ్బంది ఆమెను నిలదీయగా సదరు మహిళ వారితో గొడవకు దిగినట్టుగా చెప్పారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో 15 రోజుల పాటు..

కిలేడీ..! రూపాయి కట్టకుండా.. 15 రోజులు ఫైవ్ స్టార్ హోటల్లోనే.. స్పా సహా లగ్జరీ సేవలు..
Hotelpullman
Follow us on

ఢిల్లీలోని ఏరోసిటీలోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో యాప్‌తో నకిలీ యూపీఐ చెల్లింపులు చేసి రూ.5 లక్షలకు పైగా మోసం చేసేందుకు ప్రయత్నించిన ఓ మహిళను ఢిల్లీలో అరెస్టు చేశారు. సదరు లేడీ డిసెంబర్ 30న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ (ఐజీఐ) విమానాశ్రయం సమీపంలోని పుల్‌మన్ హోటల్‌లో దిగింది. గత 15 రోజులుగా అక్కడే ఉంది. హోటల్ వారు మహిళపై ఐజీఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితురాలు సుమారు 15 రోజుల పాటు హోటల్‌లో నకిలీ చెల్లింపులు చేసిందని, సిబ్బంది నకిలీ చెల్లింపులపై ఆరా తీయగా ఆమె వీరంగం సృష్టించింది. దాంతో హోటల్ సిబ్బంది పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్‌లో 15 రోజుల పాటు డబ్బులు ఇవ్వకుండా బస చేసింది ఆంధ్రాకు చెందిన ఓ మహిళ. ఎయిర్‌పోర్టు సమీపంలోని ఏరోసిటీలోని ఓ విలాసవంతమైన హోటల్‌లో 15 రోజులు క్రితం దిగింది..37 ఏళ్ల ఏపీ మహిళ.. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని హోటల్‌లో దిగిన ఆమె లక్షలు మోసం చేసింది. హోటల్‌ లో ఉంటూ కావాల్సిన ఫుడ్‌, డ్రింక్స్‌, స్పా వంటి అన్ని సదుపాయాలకు గానూ UPI ద్వారా ఆమె చెల్లిస్తున్నట్టుగా నకిలీ మెసేజేస్‌ చూపించినట్టుగా హోటల్‌ సిబ్బంది ఆరోపించారు. అయితే ఆ మొత్తం హోటల్ బ్యాంక్ ఖాతాలోకి వెళ్లలేదని చెప్పారు. 15 రోజులుగా డబ్బులు జమ కాకపోవటంతో..ఇదేంటని హోటల్ సిబ్బంది ఆమెను నిలదీయగా సదరు మహిళ వారితో గొడవకు దిగినట్టుగా చెప్పారు. ఫైవ్ స్టార్ హోటల్‌లో 15 రోజుల పాటు బస చేసిందని, రూ. 2.11 లక్షల స్పా బిల్లు, రూ. 5.80 లక్షల హోటల్ బిల్లుతో సహా రూ.7 లక్షలకు పైగా ఖర్చు చేసిందని హోటల్‌ సిబ్బంది ఆరోపించారు. మహిళ చేసిన వీరంగంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఏఎస్ఐ ప్రదీప్, మహిళా కానిస్టేబుల్ సోను హోటల్‌కు వచ్చి చీటింగ్‌ కేసులో ఆమెను అరెస్ట్ చేశారు.

పోలీసు అధికారి తెలిపిన వివరాల ప్రకారం,.. హోటల్ సిబ్బంది డబ్బు గురించి అడగగా పారిపోయేందుకు ప్రయత్నించినట్టుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఝాన్సీకి చెందిన రాణి శామ్యూల్ అనే మహిళ డిసెంబర్ 13న హోటల్‌ను బుక్ చేసుకుంది. హోటల్ సేవల కోసం శామ్యూల్ మోసపూరిత చెల్లింపు పద్ధతులను ఉపయోగించినట్టుగా పుల్‌మన్ హోటల్ అధికారులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు అడిగినందుకు సిబ్బందిపై దాడి చేసి పారిపోయేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఐజిఐ ఎయిర్‌పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..