వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం.. ఎలా తగలబెట్టారంటే.. వీడియో చూడండి

|

Jan 12, 2025 | 11:37 AM

బహిరంగ ప్రదేశంలో కాల్చినా, గుంతలో పూడ్చినా కాలుష్యం ఎక్కువగా వస్తుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీజీపీ తెలిపారు. సివిల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.36 వేల కోట్లు. దీంతో పాటు ఆరుగురు విదేశీ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వామ్మో.. రూ.36000 కోట్ల విలువైన డ్రగ్స్ ధ్వంసం.. ఎలా తగలబెట్టారంటే.. వీడియో చూడండి
Police Burnt Drugs
Follow us on

దేశంలో తొలిసారిగా పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ని ధ్వంసం చేశారు పోలీసులు. ఒకేసారి రూ.36 వేల కోట్ల విలువైన 6000 కిలోల డ్రగ్స్‌ను ధ్వంసం చేశారు. పోర్ట్ బ్లెయిర్, అండమాన్ & నికోబార్‌కు చెందిన విజయపురంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ను మంటల్లో కాల్చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరగోపిందర్ సింగ్ ధాలివాల్ మాట్లాడుతూ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, హోమ్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ, స్థానిక అధికారులు మద్దతుతో వీటిని నాశనం చేశామన్నారు. ఇంటర్నల్ ఫైర్ ద్వారా ధ్వంసం చేయడం వల్ల కాలుష్యం తక్కువని చెప్పారు.

బహిరంగ ప్రదేశంలో కాల్చినా, గుంతలో పూడ్చినా కాలుష్యం ఎక్కువగా వస్తుందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని డీజీపీ తెలిపారు. సివిల్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

అండమాన్-నికోబార్ పోలీసులు భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని ధర దాదాపు రూ.36 వేల కోట్లు. దీంతో పాటు ఆరుగురు విదేశీ స్మగ్లర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 222 ప్లాస్టిక్ సంచులలో ఈ మత్తుపదార్థాలను చేపల వేటకు తీసుకెళ్లాడు. బారన్ ద్వీపం దగ్గర నేవీ షిప్ వారిని పట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..