Viral News: ఎండలకు ఎండిన రిజర్వాయర్లలోని నీరు… బయల్పడిన అతిపురాతన నగర శిథిలాలు

|

Jul 17, 2022 | 10:12 AM

ఈ దేశంలోని నగరాల్లో నీటి సంక్షోభం తలెత్తింది. వేడి కారణంగా అనేక రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం అలాంటి రిజర్వాయర్ ఒకటి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

Viral News: ఎండలకు ఎండిన రిజర్వాయర్లలోని నీరు... బయల్పడిన అతిపురాతన నగర శిథిలాలు
Ancient Village Under Water
Follow us on

Viral News: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అత్యధిక వేడి, భారీ వర్షాలు, గడ్డకట్టే చలి వంటి పరిస్థితులతో పోరాడుతున్న దేశాలు అనేకం ఉన్నాయి. ముఖ్యంగా భారత దేశంతో సహా.. అనేక దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వాతావరణంలో మార్పులు నదుల నీటి మట్టంపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రకృతి ఆగ్రహానికి అనేక దేశాలు గురవుతున్నాయి. ఈ కోవలోకి తాజాగా  బ్రిటన్ కూడా చేరుకుంది. ఈ దేశంలోని నగరాల్లో నీటి సంక్షోభం తలెత్తింది. వేడి కారణంగా అనేక రిజర్వాయర్లలో నీరు పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం అలాంటి రిజర్వాయర్ ఒకటి ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. రిజర్వాయర్ల పూర్తిగా ఎండిపోవడంతో.. నదిలో ఉన్న పురాతన గ్రామం  శిధిలాలు కనిపిస్తున్నాయి.

ఈ జలాశయం హారోగేట్ సమీపంలోని థ్రస్‌క్రాస్ వద్ద ఉంది. ఈ రిజర్వాయర్ నిర్మించడానికి ముందు ఒక చిన్న గ్రామం ఉందని తెలుస్తోంది.  రిజర్వాయర్ నిర్మాణంలతో చుట్టు పక్కల గ్రామళ్లకో నీటి కొరత తీరింది. అయితే ప్రస్తుతం రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల.. నీటి మట్టం శిధిలాల స్థాయికి చేరుకుంది. దీంతో గ్రామంలోని నిర్మాణాలు ప్రస్తుతం కనిపిస్తున్నాయి.

ఇంగ్లీష్ వెబ్‌సైట్ డైలీ స్టార్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. రిజర్వాయర్ లో నీరు ఎండిపోయిన తర్వాత అందులో రోడ్లు ,వంతెనలు వంటివి నిర్మాణాలు కనిపించాయి. ఈ నగరం ఒక మైలు దూరంలో ఉన్న లిన్సీడ్ చుట్టూ ఉందని.. గ్రామంలో ప్రధాన పరిశ్రమ అని తెలుస్తోంది. అయితే తరచుగా వరద ముంపు ఏర్పడడంతో.. స్థానిక ప్రజలు క్రమంగా నగరాన్ని విడిచిపెట్టారు. ఈ నగరం దానంతటదే కనుమరుగైపోయింది. చాలా సంవత్సరాలుగా రిజర్వాయర్ ఒడ్డున గ్రామానికి చెందిన అవశేషాలు కనిపిస్తుండేవి. అయితే ఇప్పుడు ఈ జలాశయం పూర్తిగా ఎండిపోవడంతో  నగరమంతా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉష్ణోగ్రతలు పెరగడం.. నీటికి డిమాండ్‌ పెరగడం వల్ల రిజర్వాయర్ల మట్టంప్రస్తుతం సగటు కంటే చాలా దిగువకు చేరుకుందని నీటి సంస్థ అధికారులు పేర్కొన్నారు. వచ్చే వారం ప్రారంభంలో బ్రిటన్‌లో 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..