Viral Post: ఆ చర్చి సమీపంలో తవ్వకాలు.. భూమిలో దొరికిన సంచి చూసి బిల్డర్లు షాక్‌..!

చాలా సందర్భాల్లో మన చుట్టూ అనుకుకోండా జరిగే సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాగే, కొన్నిసార్లు పాత ఇండ్లు, పురాతన కట్టడాల్లో వింత, అరుదైన, విలువైన వస్తువులు బయటపడుతుంటాయి. సరిగ్గా ఇలాంటి సంఘటన ఒకటి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చింది. అది చూసిన స్థానికులు మాత్రమే కాదు.. పోలీసుల్ని కూడా షాక్ అయ్యేలా చేసింది. ఒక చర్చికి కంచె వేస్తుండగా మట్టిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ సంచి ఒకటి బయటపడింది. దానిని తెరిచి చూసిన వెంటనే అందరూ అక్కడ్నుంచి పరుగులు తీయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సంచిలో ఏముందంటే..

Viral Post: ఆ చర్చి సమీపంలో తవ్వకాలు.. భూమిలో దొరికిన సంచి చూసి బిల్డర్లు షాక్‌..!
Viral Plastic Bag

Updated on: Oct 10, 2025 | 2:59 PM

బ్రిటిష్ నగరమైన డాన్‌కాస్టర్‌లో నిర్మాణ పనుల సమయంలో ఒక షాకింగ్‌ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బిల్డర్లు ఒక స్మశానవాటిక సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా ఊహించని వస్తువు ఒకటి బయటపడింది. చర్చి చుట్టూరా కంచె నిర్మిస్తుండగా మట్టిలో పాతిపెట్టిన ప్లాస్టిక్ సంచి కనిపించింది. దాన్ని తెరిచి చూసేసరికి అది మానవ ఎముకలతో నిండి ఉండటాన్ని చూసి వారంతా షాక్ అయ్యారు. ఈ సంఘటన సౌత్ యార్క్‌షైర్ పోలీసులను కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ స్థలం ఒక చర్చి పక్కనే ఉంది.

సమాచారం ప్రకారం, నిర్మాణ కార్మికులు సెయింట్ విల్ఫ్రెడ్స్ చర్చి సమీపంలోని చర్చి లేన్‌లో చెక్క కంచెను నిర్మిస్తున్నారు. వారు పొదలు, పెరిగిన గడ్డిని తొలగించడానికి డిగ్గర్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలోనే వారు భూమిలో పాతిపెట్టిన మానవ ఎముకలు ఉన్న ఒక ప్లాస్టిక్ సంచిని గుర్తించారు.. కార్మికులు వెంటనే తమ సూపర్‌వైజర్‌కు సమాచారం అందించగా, ఆయన పోలీసులకు సమాచారం అందించారు. సౌత్ యార్క్‌షైర్ పోలీసులు ఉదయం 9:50 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.

పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఈ ఎముకలు అనేక దశాబ్దాల నాటివని తేలింది. అంటే వాటిని ఇటీవల పూడ్చిపెట్టలేదు. అందువల్ల, పోలీసులు ఎటువంటి నేరపూరిత కార్యకలాపాలకు అవకాశం లేదని తోసిపుచ్చారు. అయితే, అంత పాత ఎముకలు ప్లాస్టిక్ సంచిలోకి ఎలా వచ్చాయని, వాటిని స్మశానవాటికకు దగ్గరగా ఎందుకు పడేశారనేది మిస్టరీగా మిగిలిపోయింది. సౌత్ యార్క్‌షైర్ పోలీసులకు చెందిన డిటెక్టివ్ చీఫ్ ఇన్‌స్పెక్టర్ సైమన్ కార్ట్‌రైట్ మీడియాతో మాట్లాడుతూ, ప్లాస్టిక్ సంచిలో ఈ ఎముకలు ఉండటానికి సంబంధించిన పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనను అత్యంత సున్నితత్వంతో దర్యాప్తు నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..