Snake Video: పాడుబడ్డ కుండ నుంచి బుసల మాదిరిగా శబ్దాలు.. ఏంటా అని చూడగా..
రక్త పింజర పామును ఇంగ్లీషులో రసెల్స్ వైపర్ అంటారు. కాటుక రేకుల పాము అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు. ఇది చాలా డేంజర్. గ్రామీణ, పట్టణాల్లో మరుగు ఉన్న చోట ఇది తారసపడుతూనే ఉంటుంది. మన దేశంలో అత్యధిక పాముకాటు మరణాలకు కారణమైన 4 విష సర్పాలలో ఇది కూడా ఒకటి.

సోషల్ మీడియాలో పాముల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పాముల అంటే చాలామందికి భయం కానీ వాటి వీడియోలు మాత్రం అదే పనిగా చూస్తూనే ఉంటారు. ముఖ్యంగా పాము ఇతర జీవులతో కలబడుతున్న వీడియోలు, ఆహారం కోసం వేటాడుతున్న వీడియోలు బాగా సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఇంకొన్ని వీడియోల్లో స్నేక్ క్యాచర్స్ ప్రమాదకర పాములను జాగ్రత్త బందిస్తూ కనిపిస్తుంటారు. తాజాగా ఓ ప్రమాదకర పాము వీడియో నెటిజన్స్‌ను ఆకర్షించింది. అందులో మట్టి కుండలో రక్త పింజర బుసలు కొడుతూ కనిపించింది. ఇప్పుడు ఈ వీడియోనే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాన్ని గమినించిన స్థానికులు.. స్నేక్ క్యాచర్‌కు సమాచారమివ్వగా అతను వచ్చి రెస్క్యూ చేసినట్లు సమాచారం.
అత్యంత ప్రమాదకరమైన రక్త పింజర ముందు వరసలో ఉంటుంది. పిల్లల్ని కనడం ఈ పాము మరో ప్రత్యేకత. ఇవి సహజంగా ఎలుకల్ని ఆహారంగా తింటాయి. వెచ్చగా ఉండే గడ్డి వాములు, ముళ్ల పొదల్లో ఇవి ఎక్కువగా తచ్చాడుతూ ఉంటాయి. కాగా ఒక్క కాటులో ఇది పంపే విషంతో 16 మంది మనుషులు మరణిస్తారట.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
