Himba Tribe people: ఇంటికి వచ్చిన అతిథులతో తమ భార్యలను పంచుకునే భర్తలు..! స్నానం చేయడం నిషేధం.. ఈ తెగ సంప్రదాయాలు తెలిస్తే..
మీరు స్నానం చేయాలా వద్దా అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. కొంతమంది రోజుకు చాలాసార్లు స్నానం చేస్తారు. మరికొందరు రోజుల తరబడి స్నానం చేయరు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా స్నానం చేయడం చుట్టూ విభిన్న నమ్మకాలు, ఆచారాలు ఉన్నాయి. భూమిపై ఒక తెగ కూడా ఉంది. ఈ తెగలోని మహిళలు వారి జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే స్నానం చేస్తారు. అయినప్పటికీ, వారి శరీరాలు కళంకం లేకుండా ఉంటాయి. అవును, ఇందుకోసం వారు ఒక ప్రత్యేక రకమైన స్నానాన్ని ఉపయోగిస్తారు. అంతేకాదు.. ఈ తెగలో తమ ఇళ్లకు వచ్చే అతిథులతో తమ భార్యలను పంచుకునే భర్తలు ఉంటారు..ఇది వారికి తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. పూర్తి వివరాల్లోకి వెళితే...

ప్రపంచంలో అనేక కులాలు, వర్గాల ప్రజలు నివసిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ వారి సొంత ప్రత్యేకమైన ఆచారాలు, సంప్రదాయాలు, నమ్మకాలు ఉన్నాయి. వారి నియమాలు, నిబంధనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికీ చాలా సమాజాలు అడవులలో నివసిస్తు్న్నాయి. వారు ఇప్పటికీ వేల సంవత్సరాల నాటి సంప్రదాయాలను అనుసరిస్తున్నారు. ఈ తెగలు వారు నివసించే భూమిపై పూర్తి నియంత్రణను కలిగి ఉంటాయి. ప్రభుత్వాలు కూడా వారి హక్కులలో జోక్యం చేసుకోవు. అలాంటి వారు నేటికీ వారి పురాతన కట్టుబాట్లకు బానిసలుగా బ్రతుకుతున్నారు. పురాతన సంప్రదాయాలను అనుసరిస్తున్న ఒక తెగ గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ తెగ ప్రజలు ఆఫ్రికాలో నివసిస్తున్నారు. వీరిని నమీబియాలో నివసించే హింబా అని పిలుస్తారు. ఇంతకీ వీరి వింత ఆచారం ఏంటంటే..
నమీబియాలో విభిన్నమైన ఆచారాలు, ఆసక్తికరమైన జీవనశైలి కలిగిన చివరి సెమీ-సంచార తెగ హింబా. కాలక్రమేణా హింబా సభ్యుల సంఖ్య తగ్గింది. ఇటీవలి గణాంకాల ప్రకారం ఈ తెగలో దాదాపు 50,000 మంది ఉన్నారు. ఇళ్ళు కలిగి ఉన్న హింబాలను సెమీ-గిరిజన వర్గంలో చేర్చారు. హింబాలు నమీబియాలోని ఎడారి ప్రాంతంలో నివసిస్తున్నారు. హింబా తెగ ఆచారాలు బాహ్య ప్రపంచానికి చాలా వింతగా ఉంటాయి. ఈ తెగలో ఇది ఒక వింత సంస్కృతి ఉంటుంది. ప్రస్తుత సమాజంలో దీనిని కొనసాగించలేము.. కానీ అది అక్కడ ఒక పురాతన ఆచారం. వారు తమ సాంప్రదాయ దుస్తులు, ఆచారాలను తరం నుండి తరానికి కొనసాగిస్తున్నారు..
నిజానికి ఈ తెగ నియమాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం నిషిద్ధం. ఈ తెగ మహిళలు వారి మొత్తం జీవితంలో వారి పెళ్లి రోజున మాత్రమే స్నానం చేస్తారు. పైగా ఈ తెగ మహిళలు ఆఫ్రికాలో అత్యంత అందమైనవారిగా పరిగణించబడతారు. ఈ దేశంలో స్త్రీ వివాహం ఆమె తండ్రి నిర్ణయిస్తారు. వివాహం తర్వాత మరిన్ని వింతైన ఆచారాలను పాటించాల్సి ఉంటుంది. అంటే, ఇంటికి ఒక అతిథి వస్తే, ఇంటి యజమాని అతన్ని ఇంట్లో ఉండటానికి అనుమతిస్తే, భార్య రాత్రిపూట ఆ అతిథితో కలిసి ఉండాలి. ఇది ఆమోదయోగ్యం కానప్పటికీ, ఇది హింబా ప్రజల ప్రాచీన సంస్కృతిలో భాగం. కానీ, ఆ స్త్రీ అతిథిని కలవడానికి అంగీకరించకపోవచ్చు.. లేదా శారీరక సంబంధం లేకపోయినా ఆమె అతిథి గదిలో ఆ రాత్రి గడపవలసి ఉంటుంది. ఇది ఇక్కడ ఒక పురాతన ఆచారం.
హింబా తెగ వారు బిడ్డ పుట్టినప్పుడు చాలా ఆసక్తికరమైన సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ తెగలో బిడ్డ పుట్టే వరకు పుట్టిన తేదీ నిర్ణయించబడదు. బదులుగా ఆ స్త్రీ గర్భం దాల్చిన క్షణం నుండి నిర్ణయిస్తారు. ఇక వీరు తమను తాము శుభ్రంగా ఉంచుకోవడానికి ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు. వారు ప్రత్యేక మూలికలను నీటిలో మరిగించి, శరీరం దుర్వాసన రాకుండా ఉండటానికి ఆవిరిని ఉపయోగించి తమను తాము శుభ్రపరుచుకుంటారు. జంతువుల కొవ్వు, ఇనుము లాంటి ఖనిజమైన హెమటైట్ నుండి తయారైన పదార్థాన్ని సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి వారు ప్రత్యేక లోషన్‌ను రాసుకుంటారట.
ఆఫ్రికాలోని ఇతర గిరిజన సమాజాల మాదిరిగానే హింబాలు కూడా వ్యవసాయం, పశుపోషణ, వేటలో నైపుణ్యం కలిగి ఉన్నారు. ఎక్కువగా వారు పశువులను పెంచుతారు. వాటిలో ఆవులు, మేకలు, గొర్రెలు ఉన్నాయి. ఆవుల పాలు పితికే బాధ్యత మహిళలపైనే ఉంటుంది. సమూహంలో ఎవరికైనా ఆవు లేకపోతే వారిని గౌరవంగా చూడరు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




