Childhood photo: ముద్దులొలికే ఈ బాలుడు ఎవరో గుర్తు పట్టారా.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కలియుగ కుబేరుడి తనయుడు..

కలియుగ కుబేరుడు ముఖేష్ అంబానీ ముద్దుల తనయుడు అనంత్ అంబానీ తరచుగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈ రోజు అనంత్ అంబానీ పుట్టిన రోజుని జరుపుకుంటున్నాడు. అయితే అనంత్ తన పుట్టిన రోజుని జరుపుకోవడానికి ముందుగా కన్నయ్య ఏలిన నగరం ద్వారకకు పాదయాత్రగా చేరుకున్నారు. తన స్వస్థలమైన జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు 140 కి.మీ. మేర నడిచారు. ఈ ప్రయాణాన్ని మార్చి 29న ప్రారంభించి, ఏప్రిల్ 8న ద్వారక చేరుకున్నాడు. అనంత్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో అనంత్ అరుదైన ఫోటో ఒకటి వైరల్ అవుతుంది. బాల్యంలో ఇలా ఉండేవాడు అంటూ అతని మాజీ నానీ ఈ అరుదైన ఫోటోను షేర్ చేశారు.

Childhood photo: ముద్దులొలికే ఈ బాలుడు ఎవరో గుర్తు పట్టారా.. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న కలియుగ కుబేరుడి తనయుడు..
Anant Ambani Birthday

Updated on: Apr 09, 2025 | 4:20 PM

అనంత్ అంబానీ 30వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయన చిన్ననాటి నానీ లలితా డి’సిల్వా సోషల్ మీడియాలో బర్త్ డే విశేష్ ను స్పెషల్ గా చెప్పారు. అనంత్ అంబానీ చిన్ననాటి ఫోటోను షేర్ చేసి.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. ఈ వైరల్ ఫోటోలో అనంత్ అంబానీ పాల పళ్ళు, పొడవాటి జుట్టుతో చాలా ముద్దుగా కనిపిస్తున్నాడు.

లలిత డి సిల్వా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ చిత్రాన్ని షేర్ చేస్తూ, ‘నా అనంత్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని రాశారు. దేవుడు అనంత్ ను ఆశీర్వదించాలని కోరుకున్నారు. నా అనంత్ ఇప్పుడు చాలా పెద్దవాడు అయ్యాడు. నువ్వు జంతువులను ప్రేమించే విధానం నిజంగా ప్రశంసనీయం అంటూనే అనంత్.. జంతువులను రక్షించడంలో నువ్వు చేసిన కృషితో నేను నిన్ను మరింతగా ప్రేమిస్తున్నానని చెప్పారు నాని. ఈ రోజు మీ రోజు.. ఆస్వాదించండి, మీకు పుట్టినరోజు శుభాకాంక్షలని చెప్పారు లలిత.

తన 30వ పుట్టినరోజుని అనంత్ వెరీ వెరీ స్పెషల్ గా జరుపుకోవాలని కోరుకున్నాడు. దీంతో మార్చి 29న తన స్వస్థలమైన జామ్‌నగర్ నుంచి ద్వారక వరకు పాదయాత్ర మొదలు పెట్టి ఏప్రిల్ 8న చేరుకున్నాడు. తన తల్లితో కలిసి కన్నయ్యకు పూజలను నిర్వహించారు. అయితే అనంత్ అంబానీ పెళ్ళికి ముందు కూడా ఆధ్యాత్మిక యాత్రలను చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆయన భారతదేశంలోని బద్రీనాథ్, కేదార్‌నాథ్, కామాఖ్య, నాథ్‌ద్వారా, కాళీఘాట్, కుంభమేళాతో సహా అనేక ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించారు.

ఇవి కూడా చదవండి

అనంత్ అంబానీ చిన్ననాటి చిత్రం

లలిత సోషల్ మీడియాలో లవ్లీ గుప్తాతో లైవ్ చాట్‌లో మాట్లాడుతూ.. అంబానీ కుటుంబంలో ఎటువంటి హంగు ఆర్భాటం ఉండదని.. అనంత్, రాధిక మర్చంట్ నిశ్చితార్థం సమయంలో అంబానీ కుటుంబంతో గడిపిన సమయన్ని గుర్తు చేసుకున్నారు. అంత పెద్ద వ్యక్తులు తనను ఇలా స్వాగతిస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. నీతా మేడమ్ , ముఖేష్ సర్ చాలా ఆప్యాయంగా పలకరించారని చెప్పారు. తమ పిల్లలను సాధారణ రీతిలో పెంచాలని వారు కోరుకున్నారని చెప్పారు లలిత.

అంబానీ కుటుంబంలోని ముగ్గురు పిల్లలు ఆకాష్, ఇషా , అనంత్ లను బాల్యంలో లలిత చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. అంతేకాదు ఆమె సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ కుమారుడు తైమూర్ కు నానీగా కూడా ఉన్నారు. సమాచారం ప్రకారం ప్రస్తుతం లలిత నటుడు రామ్ చరణ్ ఉపాసనల కుమార్తె క్లిన్ కారా కొణిదెలను చూసుకుంటోంది.

 

మరిన్ని టెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..