Viral News: అతను మార్వెల్‌ కంటే సూపర్‌ హీరో.. నెటిజన్లు ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్..

Viral News: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందిరికీ తెలిసిన విషయమే. సందేశాత్మక పోస్ట్‌లతో తన అభిమానులు,

Viral News: అతను మార్వెల్‌ కంటే సూపర్‌ హీరో.. నెటిజన్లు ఆకట్టుకుంటున్న ఆనంద్ మహీంద్ర ట్వీట్..
Anand Mahindra

Updated on: Oct 25, 2021 | 8:47 PM

Viral News: మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా సోషల్‌ మీడియాలో ఎంత యాక్టీవ్‌గా ఉంటారో మనందిరికీ తెలిసిన విషయమే. సందేశాత్మక పోస్ట్‌లతో తన అభిమానులు, ఫాలోవర్లను అలరించడంలో ఆయనకు ఆయనే సాటి. ఆ విషయంలో ఆయన ప్రత్యేకతే వేరు. ఇక సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న విషయాలపై కూడా తనదైన శైలిలో ఆనంద్ మహీంద్రా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో స్ఫూర్తిదాయకమైన వీడియోను ట్విట్టర్‌ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు ఆనంద్‌ మహీంద్రా. మహీంద్రా కంపెనీ నుంచి వచ్చిన ‘బోలెరో’ వాహనాన్ని సామాజిక సేవ కోసం వినియోగిస్తున్న ఓ వ్యక్తి గురించి ఆయన ఈ వీడియోలో వివరించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది.

ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. ఢిల్లీకి చెందిన 72 ఏళ్ల అలగ్‌ నటరాజన్‌ కొన్ని రోజుల క్రితం ఇంగ్లండ్‌ నుంచి ఇండియాకు తిరిగివచ్చారు. అప్పటి నుంచి తన దగ్గర ఉన్న మహీంద్రా బోలెరో వాహనాన్ని ‘మట్కా’ గా.. అంటే ‘తాగునీటి కుండ’ లా మార్చి, పేద ప్రజల దాహం తీరుస్తున్నారు. అందుకోసం ఆయన ఉదయం 5 గంటలకే నిద్రలేచి తన వాహనంతో దక్షిణ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో ఉండే మట్టి కుండలను తాగునీటితో నింపుతున్నారు. అలాగే నిర్మాణ రంగంలో ఉండే కార్మికుల కోసం ప్రత్యేకంగా పోషకాహార సలాడ్‌లు తయారుచేసి పంచుతున్నారు. దారిలో కనిపించే సెక్యూరిటీ గార్డ్‌లు, డ్రైవర్లకు కూడా అతను ఆపన్న హస్తం అందిస్తున్నారు. ఇలా తన సేవా దృక్పథంతో స్ఫూర్తిగా నిలుస్తోన్న నటరాజన్‌ గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా.. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో తెలియజేశారు. అతనిని మార్వెల్‌ హీరోతో పోల్చారు. ‘మార్వెల్‌ కంటే శక్తి వంతమైన సూపర్‌ హీరో ఈ మట్కామాన్‌ నటరాజన్‌. అతను ఇంగ్లండ్‌లో ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌. క్యాన్సర్‌ను కూడా జయించాడు. పేదలకు ఆపన్నహస్తం అందించడానికి ఇండియాకు తిరిగివచ్చాడు. మీ సామాజిక సేవ కోసం మా బోలెరో వాహనాన్ని వినియోగించుకుంటున్నందుకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు ఆనంద్‌ మహీంద్రా. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. నటరాజన్‌కు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఆయన సేవానిరతికి అభివాదాలు తెలుపుతున్నారు.

Also read:

Tirumala: న‌వంబ‌ర్ మాసంలో తిరుమల శ్రీ‌వారికి జ‌రుగ‌నున్న విశేష ఉత్సవాల వివ‌రాలు

TRS Plenary: 8 గంటలు.. ఏడు తీర్మానాలు.. కోలాహలం మధ్య 20 ఏళ్ల గులాబీ పండుగ..

Mani Sharma Son Marriage: అట్టహాసంగా సింగర్‌ను వివాహమాడిన మణిశర్మ కుమారుడు మహతి స్వరసాగర్