Watch: 5 ఏళ్ల అమ్మాయి.. చూస్తుండగానే 95ఏళ్ల వయసులోకి మారిపోయింది..! అద్భుతమై వీడియో..

|

Apr 26, 2023 | 7:35 PM

AI తో తనకైతే ఎలాంటి భయాలు లేవు..నిజంగా ఇది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా అందంగా, మెస్మరైజ్‌ చేసేలా ఉంది. వాస్తవానికి చాలా దగ్గరగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు. ఇక వీడియో చూసిన నెటిజన్లు సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

Watch: 5 ఏళ్ల అమ్మాయి.. చూస్తుండగానే 95ఏళ్ల వయసులోకి మారిపోయింది..! అద్భుతమై వీడియో..
Anand Mahindra
Follow us on

ప్రతి ఒక్కరిలోనూ వారి వారి సొంత సృజనాత్మకత దాగి వుంటుంది. అత్యాధునిక టెక్నాలజీ సహాయంతో ఎవరూ ఊహించని రీతిలో క్రియేటర్స్ వారి ఊహలకు జీవం పోస్తున్నారు. దీంతో ప్రస్తుత మార్కెట్‌లో AI క్రేజ్ పెరిగింది. దీనికి ఇంటర్నెట్‌లో విపరీతమైన ట్రెండ్ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే ప్రఖ్యాత పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన మరో AI సంబంధిత సృజనాత్మక పోస్ట్ ఇప్పుడు చాలా మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో 5 నుండి 95 సంవత్సరాల వయస్సు వరకు ఒక అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతున్న రూపాంతరాలను చూపుతుంది. ఇలా, వయసు పెరిగే కొద్దీ అమ్మాయి ఎలా మారుతుందో ఈ వీడియోలో అద్భుతంగా చూపించారు. అటువంటి సృజనాత్మక AI- రూపొందించిన వీడియో వ్యవస్థాపకుడు ఆనంద్ మహీంద్రా దృష్టిని ఆకర్షించింది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోని పూర్తిగా చూసి మంత్రముగ్ధులయ్యారు. వీడియో క్యాప్షన్‌ను అద్భుతం అని షేర్ చేశారు.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి మహిళగా రూపాంతరం చెంది, వృద్ధురాలిగా ఎలా కనిపిస్తుందో ఆ వీడియోలో చూపించారు. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేస్తూ ఇలా రాశారు..AI సాయంతో జనరేట్‌ చేసిన పోర్ట్రెయిట్స్‌తో కూడిన ఈ వీడియో అద్భుతంగా ఉంది. AI తో తనకైతే ఎలాంటి భయాలు లేవు..నిజంగా ఇది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోందంటూ వ్యాఖ్యానించారు. ఇది చాలా అందంగా, మెస్మరైజ్‌ చేసేలా ఉంది. వాస్తవానికి చాలా దగ్గరగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా స్పష్టం చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, సోషల్ మీడియాలో వీడియో కేవలం ఒక రోజు క్రితమే షేర్ చేయగా, ఇప్పటికే 6 లక్షల 40 వేల కంటే ఎక్కువ వ్యూస్‌ సంపాదించింది. అలాగే, క్లిప్‌కి 11,000 కంటే ఎక్కువ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు రీట్వీట్‌లు చేశారు.. అలాగే ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..