Watch Video: బీటెక్‌ యువతి హైటెక్‌ బిజినెస్‌ ఐడియా అదుర్స్‌..! కొత్త థార్‌తో పానీ పూరి బండి లాగుతూ..

|

Feb 01, 2024 | 8:54 PM

ప్రస్తుతం తనకు దేశవ్యాప్తంగా 40కి పైగా బండ్లు ఉన్నాయని తాప్సీ వీడియోలో చెప్పింది.అయితే, ఇదంతా సాధించటానికి ఆమె చాలా కష్టపడ్డానని చెప్పింది. దీని వెనుక వేల రోజుల శ్రమ ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న పానీపూరీ వ్యాపారం బండిని ఆమె థార్‌కి కనెక్ట్ చేసి, తాను వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత గోల్‌గప్పలను విక్రయిస్తుంది. ఈ వీడియోను 'X'లో దాదాపు రెండు లక్షల సార్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల క్లిప్‌లో, తాప్సీ తన గోల్గప్పా ప్రత్యేకతను చెబుతోంది.

Watch Video: బీటెక్‌ యువతి హైటెక్‌ బిజినెస్‌ ఐడియా అదుర్స్‌..! కొత్త థార్‌తో పానీ పూరి బండి లాగుతూ..
Mahindra Thar To Tow Cart
Follow us on

పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కొత్త పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈసారి ఆనంద్‌ మహీంద్ర తన కొత్త థార్‌తో పానీ పూరీ స్టాల్‌ను లాగుతున్న బి టెక్ పానీ పూరీ వ్యాపారి వీడియోను పోస్ట్ చేశాడు. ఆనంద్ మహీంద్రా ‘బి టెక్ పానీ-పూరీ వ్యాపారి’గా ప్రసిద్ధి చెందిన తాప్సీ ఉపాధ్యాయ్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు, ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఆనంద్ మహీంద్రా ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు – ఆఫ్-రోడ్ వాహనాలు దేనికి ఉపయోగించబడతాయి? ప్రజలు ఇంతకు ముందు వెళ్లలేని ప్రదేశాలకు వెళ్లడానికి వారు సహాయం చేస్తారు. అసాధ్యమైన వాటిని అన్వేషించడంలో ప్రజలకు సహాయం చేయడం. ముఖ్యంగా మా కార్లు ప్రజలు ముందుకు సాగడానికి, వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాము. నేను ఈ వీడియోను ఎందుకు ఇష్టపడుతున్నానో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుందన్నారు.

ఆఫ్ రోడ్ SUV థార్ చాలా ప్రజాదరణ పొందింది. పొదుపుగా ఉండటమే కాకుండా, దీని మోడల్ డిజైన్ వినియోగదారులకు చాలా నచ్చింది. ఈ క్లిప్‌లో యువతి ఇంతకుముందు తన స్కూటర్ ద్వారా తన పానీపూరీలను విక్రయించేదని చెప్పింది. దీని తర్వాత ఆమె బుల్లెట్‌తో బండిని లాగేది. ఇప్పుడు ఆమె థార్ నడుపుతోంది. ప్రస్తుతం తనకు దేశవ్యాప్తంగా 40కి పైగా బండ్లు ఉన్నాయని తాప్సీ వీడియోలో చెప్పింది.అయితే, ఇదంతా సాధించటానికి ఆమె చాలా కష్టపడ్డానని చెప్పింది. దీని వెనుక వేల రోజుల శ్రమ ఉంది. ఇప్పుడు ఆమె చేస్తున్న పానీపూరీ వ్యాపారం బండిని ఆమె థార్‌కి కనెక్ట్ చేసి, తాను వెళ్లాల్సిన ప్రదేశానికి చేరుకున్న తర్వాత గోల్‌గప్పలను విక్రయిస్తుంది. ఈ వీడియోను ‘X’లో దాదాపు రెండు లక్షల సార్లు వీక్షించారు. ఈ 58 సెకన్ల క్లిప్‌లో, తాప్సీ తన గోల్గప్పా ప్రత్యేకతను చెబుతోంది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్‌ గా మారిన వీడియోపై నెటిజన్లు చాలా మంది స్పందించారు. యువతి కష్టాన్ని గుర్తించిన కొందరు ఆమెను ఎంతగానో ప్రశంసిసత్ఉన్నారు. సోషల్ మీడియాలో వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్ర సైతం యువతిని ప్రశంసించారు. వీడియోపై ఆనంద్ మహీంద్రా స్పందిస్తూ… తమ వాహనాలు ప్రజలను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు, వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయపడతాయని చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..