రైలు ప్రయాణాలు (Train Journey) చేయడం చాలా మందికి గొప్ప అనుభూతి కలిగిస్తుంది. కిటికీ పక్కన కూర్చుని, వేగంగా పరుగులు తీస్తున్న రైలు నుంచి బయటి దృశ్యాలను చూస్తూ సాగిపోవడం మరిచిపోలేని మెమొరీని ఇస్తుంది. అయితే రైలు ప్రయాణాలు ఎంత ఉల్లాసంగా ఉంటాయో.. మనం చేసే అతి చిన్న పొరపాట్లు అంతే ప్రభావాన్ని చూపిస్తాయి. రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏ చిన్న తప్పిదం జరిగినా అది ప్రాణాలే తీసేసే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటి యాక్సిడెంట్ (Videos) కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) అధికారి వేగంగా స్పందించడం కారణంగా ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. వైరల్ అవుతున్న ఈ వీడియో మహారాష్ట్రలోని పూణె రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఈ ఘటన సీసీటీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో షేర్ చేసింది. అంతే అది క్షణాల్లో వైరల్ గా మారింది.
आरपीएफ कर्मचारी की सतर्कता से बची यात्री की जान!
ఇవి కూడా చదవండిमहाराष्ट्र के पुणे स्टेशन पर चलती ट्रेन से उतरने के दौरान एक यात्री संतुलन खो बैठा, जिसे वहां तैनात सजग आरपीएफ कर्मियों ने बचाया।
सभी से अनुरोध है कि चलती ट्रेन में चढ़ने/उतरने का प्रयास ना करें, यह जानलेवा हो सकता है। pic.twitter.com/LpNuAT6Qy2
— Ministry of Railways (@RailMinIndia) September 6, 2022
వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఓ వ్యక్తి రైలు ఆగకముందే లగేజ్ తో సహా రైలు నుంచి కిందికి దిగేందుకు ప్రయత్నిస్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి బాడీ బ్యాలెన్స్ కోల్పోయి ప్లాట్‌ఫామ్‌పై పడిపోతాడు. అక్కడే ఉన్న ఓ రైల్వే అధికారి వెంటనే అప్రమత్తమై కిందపడిన వ్యక్తిని వేగంగా బయటకు లాగుతాడు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో అప్ లోడ్ అయ్యాయి. ఈ క్లిప్ కు ఇప్పటివరరకు 23,000 వ్యూస్ వందల కొద్దీ లైక్స్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. కదులుతున్న రైళ్లలో ఎక్కడం లేదా దిగడం వంటివి చేయకూడదని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.