వార్నీ.. తలలో పేను కారణంగా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..! ఏం జరిగిందంటే..

|

Aug 05, 2024 | 7:34 PM

విమానాన్నిదారి మళ్లించి అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందుకు కారణం వైద్యం కోసం.. మెడికల్ ఎమర్జెన్సీ అని ప్రకటించారు. విమానం ల్యాండ్ కాగానే.. ప్యాసింజర్స్ అంతా కిందకు దిగేశారు. వారికి హోటల్ వొచర్ కూడా అందజేశారు. అలా విమానం చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరకు అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. మహిళా ప్రయాణికురాలి తల గమనిస్తే సరిపోయేది అంటూ విమర్శించుకున్నారు. ఈ ఘటన జూన్ నెలలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వార్నీ.. తలలో పేను కారణంగా ఎయిర్‌లైన్స్‌ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌..! ఏం జరిగిందంటే..
American Airlines Flight
Follow us on

విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ గురించి చాలా సందర్భాల్లో వినే ఉంటారు. వివిధ కారణాల వల్ల విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ఎయిర్‌లైన్స్ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ ప్రయాణిస్తున్న అమెరికా ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. దాంతో విమానాన్ని అత్యవసరంగా దింపేశారు సిబ్బంది. ఈ సంఘటనకు సంబంధించి విమానంలో ప్రయాణిస్తున్న ఏతాన్ జుడెల్సన్ తన అనుభవాన్ని టిక్‌టాక్‌లో పంచుకున్నారు. ఈ సంఘటన జూన్‌లో జరిగినట్లు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికా ఎయిర్ లైన్స్ 2201 విమానం లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్‌కు ప్రయాణిస్తోంది. విమానంలో అందరూ సైలంట్‌గా ఉన్నారు. ఇంతలో ఉన్నట్టుండి హడావిడి మొదలైంది… విషయం ఏంటంటే.. ఓ మహిళ తల మధ్యలో పేను కనిపించిందట. మహిళలకు పేలు అనేది కామన్. అది చూసిన ఓ ప్రయాణికులు కంగారుపడిపోయింది. అదేదో బగ్ అనుకొని, వెంటనే విమాన సిబ్బందికి కంప్లైట్‌ చేసింది. సిబ్బంది సైతం ఏం జరిగిందనే విషయం ఆరా తీయలేదు. కనీసం నిర్ధారించుకోలేదు. విమానాన్ని ఫినిక్స్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందుకు కారణం వైద్యం కోసం.. మెడికల్ ఎమర్జెన్సీ అని ప్రకటించారు. విమానం ల్యాండ్ కాగానే.. ప్యాసింజర్స్ అంతా కిందకు దిగేశారు. వారికి హోటల్ వొచర్ కూడా అందజేశారు. అలా విమానం చాలా సేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. చివరకు అసలు విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. మహిళా ప్రయాణికురాలి తల గమనిస్తే సరిపోయేది అంటూ విమర్శించుకున్నారు. ఈ ఘటన జూన్ నెలలో జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీడియోలో, ఎతాన్ జుడెల్సన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. విమానం 12 గంటల ఆలస్యం గురించి వివరించాడు. . విమానం ఎమర్జెన్సీ ల్యాండ్‌ చేయాల్సిన కారణం మెడికల్ ఎమర్జెన్సీ అని మెయిల్ వచ్చిందని తెలిపారు. ఆ తర్వాత కూడా అమెరికా ఎయిర్ లైన్స్ అధికారిక ప్రకటన చేసింది. జూన్ 15వ తేదీన అమెరికా ఎయిర్ లైన్స్ లాస్ ఏంజెల్స్ నుంచి న్యూయార్క్ బయల్దేరింది. వైద్యం కోసం ఫినిక్స్‌లో విమానం దారి మళ్లించాం అని ప్రకటన చేసింది. కానీ, విచిత్రం ఏంటంటే.. అంతా పెద్ద విమానం ఒక చిన్న పేను కారణంగా వారి ప్రయాణం 12 గంటల ఆలస్యమైందని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..