Viral Video: గోడపై చిత్రంలో ఎన్నో అద్భుతాలు.. ఆర్టిస్ట్ క్రియోటివిటీకి జోహార్లు.. మనసు దోచుకుంటున్న వీడియో

|

Jul 27, 2022 | 2:53 PM

ప్రస్తుత కాలంలో డిజిటల్ పెయింటింగ్ (Digital Painting) వీడియోలు ఇంటర్నెట్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పెయింటింగ్‌ను చూసిన తర్వాత ఆ ఆర్టిస్త్.. దీన్ని ఎలా రూపొందించాడోనని ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇలాంటి పెయింటిటంగ్ లు చాలా చిన్నగా...

Viral Video: గోడపై చిత్రంలో ఎన్నో అద్భుతాలు.. ఆర్టిస్ట్ క్రియోటివిటీకి జోహార్లు.. మనసు దోచుకుంటున్న వీడియో
Digital Painting Viral Vide
Follow us on

ప్రస్తుత కాలంలో డిజిటల్ పెయింటింగ్ (Digital Painting) వీడియోలు ఇంటర్నెట్ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పెయింటింగ్‌ను చూసిన తర్వాత ఆ ఆర్టిస్త్.. దీన్ని ఎలా రూపొందించాడోనని ఆశ్చర్యపోతూ ఉంటాం. ఇలాంటి పెయింటిటంగ్ లు చాలా చిన్నగా ఉంటుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ గా మారింది. ఈ 1 నిమిషం 15 సెకన్ల వీడియో ఇప్పటివరకు 30 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ సంపాదించింది. చాలా అద్భుతంగా ఉన్న ఈ వీడియోను నెటిజన్లు మళ్లీ మళ్లీ చూసేందుకు ఆరాటపడుతున్నారు. ఈ వీడియోలో గోడపై చిన్న ఫోటో ఉంది. ఆ ఫ్రేమ్ ను జూమ్ చేయడం ద్వారా, మళ్లీ జూమ్ చేయడం, మళ్లీ మళ్లీ జూమ్ చేయడం ద్వారా కొండపై రైలు, రైలులో కెమెరా, కెమెరాలో దీవీ.. ఇలా నిడివి ఉన్నంత వరకు పూర్తిగా అరుదైన, అందమైన చిత్రాలు కనిపిస్తూనే ఉంటాయి. ఈ వీడియో తప్పకుండా ఆశ్చర్యపోయేలా చేయడంతో పాటు ఆర్టిస్ట్ పనితనాన్ని మెచ్చుకునేలా ఉంటుంది.

ఈ అద్భుతమైన డిజిటల్ పెయింటింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. దీనికి ‘పర్ఫెక్ట్ డిజిటల్ పెయింటింగ్ ఆర్ట్’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. క్యాప్షన్ ప్రకారం ఉన్న ఈ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు 17 లక్షల మందికి పైగా లైక్ చేశారు. 3 లక్షల 75 వేల మందికి పైగా రీట్వీట్ చేశారు. అంతే కాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..