Viral News: విమానం ఎక్కాలనే మీ కల కలగానే మిగిలిపోయిందా..? జీవితంలో ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని, ఎంజాయ్ చేస్తూ.. భోజనం చేయాలని అనుకుంటున్నారా..? కానీ, మీ బడ్జెట్ సరిపోదని ఆగిపోతున్నారా..? అయితే, ఈ ఛాన్స్ మీలాంటి వారికోసమే.. నిజమైన విమానంలో ప్రయాణించే అవకాశం పొందలేని వారి కోసం.. ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో కూర్చుని ఆహారం తీసుకుంటూ నిజమైన విమానంలో ఉన్నట్లుగా అనుభూతి పొందవచ్చు. ప్రపంచంలో ఇప్పటివరకు ఇలాంటి రెస్టారెంట్లు 8 ఉండగా, 9 వ రెస్టారెంట్ గుజరాత్‌లోని వడోదరలో ప్రారంభమైంది. మన దేశంలో ఇది నాలుగోది. వడోదరతో పాటు పంజాబ్‌లోని లూథియానా, హర్యానాలోని అంబాలా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో కూడా ఈ ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్లు ఉన్నాయి.
ఈ ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్‌లో అన్ని సెన్సార్లు విమానంలో మాదిరిగానే ఇన్‌స్టాల్ చేశారు. వెయిటర్‌ని పిలవడానికి ఫ్లైట్‌లోలాగా సెన్సార్‌లు అమర్చారు. అతిథులకు ఫీల్ వచ్చేందుకు మధ్యమధ్యలో టేకాఫ్ అవుతున్నట్లు విమానాన్ని కదిపే ఏర్పాట్లు చేశారు. అప్పుడప్పుడు అనౌన్స్‌మెంట్ కూడా వినిపిస్తుంది. వెయిటర్లు, సర్వర్లు ఎయిర్ హోస్టెస్, స్టీవార్డెస్‌ల వలె కనిపిస్తారు. దీని వల్ల విమానంలో కూర్చోవడం లాంటి అనుభూతిని ఇక్కడికి వచ్చేవారు పొందుతారని నిర్వాహకులు చెప్తున్నారు. పంజాబీ, చైనీస్, కాంటినెంటల్, ఇటాలియన్, థాయ్, మెక్సికన్ వంటకాలను ఈ రెస్టారెంట్‌లో ఆందుబాటులో ఉంచారు.
ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ వడోదర నగరంలోని తర్సాలి బైపాస్‌లో నిర్మించారు. బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ నుంచి 1కోటి 40లక్షలకు ఎయిర్ బస్ 320 స్క్రాప్ ఎయిర్ క్రాఫ్ట్ కొనుగోలు చేసినట్లు రెస్టారెంట్ యజమాని ఎండీ ముఖి తెలిపారు. విమానంలోని కొన్ని భాగాలను విడదీసి వడోదరకు తరలించి రెస్టారెంట్‌గా మార్చారు.
Also read:
Hyderabad: కొడుకును చంపినోడు కళ్లముందే దర్జాగా తిరుగుతున్నాడని రగిలిపోయాడు.. ఆ తరువాత ఏం చేశాడంటే..
Tiger in Telangana: తెలంగాణ సరిహద్దు గ్రామాల్లో పెద్దపులి కలకలం.. పశువుల కాపరి మృతి..
Viral News: ఎయిర్‌క్రాఫ్ట్ రెస్టారెంట్.. విమానంలో తింటున్న ఫీలింగ్.. అందరూ ఆహ్వానితులే..!