4 కాళ్లతో పుట్టిన శిశువుకు అరుదైన ఆపరేషన్.. 8 గంటల పాటు శ్రమించిన వైద్యులు.. చివరకు..

|

Dec 03, 2024 | 7:35 PM

పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ చిన్నారికి ..రెండు కాళ్లు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. మిగతా రెండు కాళ్లు అసాధారణ స్థితిలో ఉన్నాయని చెప్పారు. అంతే కాకుండా చిన్నారి వెన్నుముకపై

4 కాళ్లతో పుట్టిన శిశువుకు అరుదైన ఆపరేషన్.. 8 గంటల పాటు శ్రమించిన వైద్యులు.. చివరకు..
Four Legged Baby
Follow us on

AIIMS వైద్యులు అరుదైన ఆపరేషన్ నిర్వహించారు. నాలుగు కాళ్లతో పుట్టిన 9 నెలల చిన్నారికి 8గంటల పాటు అత్యంత సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేశారు. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో వెలుగు చూసింది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ వైద్యులు ఆ చిన్నారికి సర్జరీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ ఓ శిశువు నాలుగు కాళ్లు, వెన్నెముక పైభాగంలో భారీ వాపుతో జన్మించింది. తమ బిడ్డ వికృతమైన రూపాన్ని చూసిన ఆ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పసికందుకు ఆరోగ్యంపై ఆందోళనతో వారు తమ బిడ్డను 2024 మార్చి6న రిషికేశ్‌లోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ పీడియాట్రిక్ సర్జరీ OPDలో సంప్రదించారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం అధిపతి, మెడికల్ సూపరింటెండెంట్ ప్రొ. సత్యశ్రీ చిన్నారికి రెండు కాళ్లు మామూలుగానే ఉన్నాయని గుర్తించారు. మిగతా రెండు కాళ్లు అసాధారణ స్థితిలో ఉన్నాయని చెప్పారు. అంతే కాకుండా చిన్నారి వెన్నుముకపై పెద్దగా వాపు రావడం, ఒక్క కిడ్నీ మాత్రమే ఉన్నట్టుగా గుర్తించారు. చిన్నారికి ఆపరేషన్‌ చేయాలని తల్లిదండ్రులకు వివరించారు.

పీడియాట్రిక్ సర్జరీ విభాగానికి చెందిన డాక్టర్ ఇనోనో యోషు సర్జరీ కోసం చిన్నారికి అన్ని రకాల టెస్టులు నిర్వహించి, క్షుణ్ణంగా పరీక్షించిన అనంతరం ఆపరేషన్‌కు సిద్ధం చేశారు. 8 గంటల పాటు చిన్నారికి ఆపరేషన్‌ కొనసాగింది. వెన్నుముకపై పెద్దగా వాపు, ఒక్క కిడ్నీ మాత్రమే ఉండటంతో సర్జరీ చాలా క్లిష్టంగా మారిందని వైద్యులు వెల్లడించారు. ఎట్టకేలకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు. ఇందులో వివిధ విభాగాల వైద్యులు సహకరించారు. మూడు వారాల పాటు శిశువును అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొ. మీనూ సింగ్ సర్జరీ చేసిన వైద్యుల బృందాన్ని ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..