Telugu News Trending Africa Children dancing on Kala Chashma Song video gone viral in social media telugu news
Video Viral: ఆఫ్రికాను ఊపేస్తున్న కాలా చష్మా.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న చిన్నారుల డ్యాన్స్ వీడియో
ఇండియన్ (Indian) సాంగ్స్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ట్రెండ్ గా మారతాయి. భారతీయ సినిమాలకు సంబంధించిన అనేక పాటలు విదేశాల్లోనూ వినిపిస్తాయి. హిట్ పాటలపై ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర...
ఇండియన్ (Indian) సాంగ్స్ మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని పలు దేశాల్లోనూ ట్రెండ్ గా మారతాయి. భారతీయ సినిమాలకు సంబంధించిన అనేక పాటలు విదేశాల్లోనూ వినిపిస్తాయి. హిట్ పాటలపై ఇండియన్స్ మాత్రమే కాకుండా ఇతర దేశాల వారు కూడా డ్యాన్స్ చేస్తుంటారు. సాధారణంగా పలు భాషల్లో టాప్ గా నిలిచిన పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. వీటిని నెటిజన్లు బాగా ఇష్టపడుతుంటారు. వాటికి తగ్గట్టుగా డ్యాన్స్ చేయడం, పాటలు పాడడం, యాక్టింగ్ చేయడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ ధోరణి విదేశాల్లోనూ కనిపించడం మనకు కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. వాటికి విదేశీయులు స్టెప్స్ వేస్తుంటే మనకు ఒక రకమైన తెలియని అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలోఎన్నో రకాల వీడియోలు ఉంటాయి. ట్యాలెంట్ ను బయటకు తీసేందుకు మంచి సాధనంగా సోషల్ మీడియాను చెప్పవచ్చు. చాలా మంది డ్యాన్స్, పాటలు, స్టంట్ వీడియోలను సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఉంచుతారు. దీంతో అవి మరింత వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం కాలా చష్మా వీడియో ట్రెండ్ అవుతోంది. ఈ పాటపై చాలా మంది వ్యక్తులు రీల్స్ చేసి, వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో కూడా అలాంటిదే.
ఈ వీడియోలో కొంతమంది పిల్లలు డ్యాన్స్ వేయడం చూడవచ్చు. వారిని చూస్తుంటే ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి చెందిన వారని తెలుస్తోంది. వారు కాలా చష్మా పాటకు అద్భుతమైన స్టెప్స్ వేశారు. పాటపై 12 మంది చిన్నారులు డ్యాన్స్ చేస్తుంటారు. ఒరిజినల్ స్టెప్స్‌తో పాటు రీమిక్స్ స్టెప్పులనూ వేస్తూ ఆశ్చర్యకరమైన ప్రదర్శన ఇచ్చారు. అంతే కాకుండా చిన్నారులు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. చిన్నారుల డ్యాన్స్, వారి ట్యాలెంట్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.