
ఈ చిన్నారి వీడియో చూస్తే మీ మనసు తేలికవుతుంది. ఆ వీధి శునకాలకు ఆ పాప.. బెస్ట్ ఫ్రెండ్.. కేర్ టేకర్. ఇంకా చెప్పాలంటే తను వాటికి కమాండర్. తను వెళ్తుంటే ఆ శునకాలు బాడీ గార్డ్స్‌లా పక్కనే వెళ్తున్నాయి. ఇంకా చెప్పాలంటే తను వాటిపై కూర్చని ఎంచక్కా ప్రయాణిస్తుంది. అవును ఇటీవల, ఒక చిన్నారి తన వీధి మిత్రుడైన శునకాలతో స్నేహపూర్వకంగా వ్యవహరించిన మధురమైన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కల్మషం లేని మనసులకు ప్రతిరూపం ఈ వీడియో అని పలువురు కామెంట్స్ పెడుతున్నారు. జీవితంల అనురాగాన్ని పంచడం ఎంత ముఖ్యమో గుర్తుచేసిందంటున్నారు.
వీడియోలో, చిన్నారి ఓ వీధిలో ఉన్న కుక్కలను స్నేహపూర్వకంగా తడుముతూ, వాటితో ఆడుకుంటూ కనిపిస్తుంది. ఓ కుక్క కూడా బాలిక ప్రేమకు ప్రతిస్పందిస్తూ సంతోషంతో తలూపడం చూడొచ్చు. ఈ దృశ్యం చూడటానికి ఎంత అందంగా ఉందంటే, నెటిజన్లు ఆ చిన్నారి, కుక్క మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధాన్ని చూసి ఫిదా అయ్యారు. నెటిజన్ల స్పందనలు కూడా చాలా మధురంగా ఉన్నాయి. ఒకరు ఈ వీడియో చూసి, “ఎలాంటి గజిబిజీ లేని పసి మనుషులు.. ఈ లోకాన్ని మర్చిపోయి ప్రేమలో మునిగిపోయార,” అని ఒకరు వ్యాఖ్యానించారు. “ఈ దృశ్యం చాలాకాలం నా మనసులో నాటుకుపోతుందని” మరొకరు ప్రశంసించారు.
ఈ వీడియో జీవితాలకు కావాల్సిన చిన్న ఆనందాలను గుర్తు చేయడమే కాకుండా, ప్రేమను పంచడం ఎంత శక్తివంతమైనదో చాటి చెబుతుంది. ఈ వీడియోలోని చిన్నారి ఎవరు లేదా ఈ సంఘటన జరిగిన స్థలం గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.
వీడియో దిగునవ చూడండి..
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..