
Viral News: కేఎఫ్‌సీ బహుశా ఈ పేరు తెలియని చికెన్ ప్రియులు ఉండరనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదేమో. ఎక్కడో అమెరికాలో మొదలైన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకుంది. చిన్న చిన్న పట్టణాల్లో కూడా కేఎఫ్‌సీ అవుట్‌లెట్స్ ఓపెన్ అయ్యాయంటే ఈ బ్రాండ్‌కి ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. చికెన్‌ను తమదైన ఫ్లేవర్‌ను అద్ది ప్రపంచవ్యాప్తంగా ఉన్న చికెన్ అభిమానులను తమవైపు తిప్పుకుందీ సంస్థ. అయితే తాజాగా ఈ సంస్థ చేసిన పని ఓ మహిళను షాక్‌కు గురిచేసింది. ప్రస్తుతం ఈ అంశం నెట్టింట వైరల్‌గా మారింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇంగ్లండ్‌లోని ట్వికెన్‌హామ్‌కు చెందిన గాబ్రియేల్ అనే మహిళ ఆన్‌లైన్‌లో కేఎఫ్‌సీ చికెన్‌ను బుక్ చేసుకున్నారు. సదరు మహిళ హాట్ వింగ్‌ను మీల్‌ను బుక్ చేసుకున్నారు. అయితే అందులో వింగ్స్‌తో పాటు కోడి తల కూడా రావడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. వెంటనే ఆ కోడి తల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ యూకే కేఎఫ్‌సీని ట్యాగ్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. దీంతో ఈ పోస్ట్‌పై కేఎఫ్‌సీ సంస్థ స్పందించింది.
పార్శిల్‌లో ఆ కోడి తల ఎలా వచ్చిందో తెలియడం లేదని, దీనిపై విచారణకు ఆదేశించామని తెలిపారు. ఇది అత్యంత అరుదైన సంఘటన అని తెలిపిన యాజమాన్యం.. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఆ మహిళకు కేఎఫ్‌సీ చికెన్ తయారీ యూనిట్‌ను కూడా చూపిస్తామని, తమ సంస్థపై నమ్మకాన్ని కొనసాగిస్తామని ట్వీట్ చేశారు.
Ahem ?️ pic.twitter.com/dM0xi1WLf9
— KFC UK (@KFC_UKI) December 22, 2021
Also Read: Amrapali Gan: మరో అంతర్జాతీయ కంపెనీ అధిపతిగా భారతీయ మహిళ.. ఓన్లీ ఫ్యాన్స్ సీఈవోగా ఆమ్రపాలి..
Hero motocorp: వాహనాల ధరలు పెంచనున్న హీరో మోటోకార్ప్.. ఎప్పటి నుంచి అంటే..
Bangarraju: జూనియర్ బంగార్రాజుతో స్టెప్పులేస్తున్న నాగలక్ష్మీ.. ఆకట్టుకుంటున్న చై.. కృతి పోస్టర్..