ఇటీవల సోషల్ మీడియాలో ఓ మహిళ చర్చనీయాంశమైంది. కారణం ఏంటో తెలిస్తే మీరు నోరెళ్ల బెడతారు. ఈ మహిళ పెంపుడు జంతువులను వాకింగ్‌కు తీసుకువెళ్లటం ద్వారా కొన్ని లక్షలు సంపాదిస్తుంది. ఎందుకంటే ఆమె చేస్తున్న పని గురించి మీరు గతంలో ఎప్పుడూ వినుండరు..బాహుశ చూసి కూడా ఉండారు..ప్రజలు తమ పెంపుడు కుక్కలను వాకింగ్ కోసం తీసుకెళ్లడం మీరు తరచుగా చూస్తారు. పెంపుడు కుక్కల యజమానుల కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు వాటిని తప్పనిసరిగా వాకింగ్ కోసం బయటకు తీసుకువెళ్తుంటారు.. అలాగే, కొన్నిసార్లు ఇతర వ్యక్తులను పనిలో పెట్టుకుని వారితో పెంపుడు కుక్కల పనులు కూడా చేయిస్తుంటారు.. బయటి వ్యక్తులను పెంపుడు కుక్కల వాకింగ్ కోసం నియమించుకున్నట్టయితే.. వారు కుక్కల్ని బయటకు తీసుకెళ్లడానికి ఎంత వసూలు చేస్తారో తెలుసా..? ఈ పని చేస్తూ లక్షల రూపాయలు సంపాదించవచ్చునని మీకు తెలుసా..?అవును మీరు చదివింది నిజమే..ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన మహిళ ఇందుకు ఒక ఉదాహరణ నిలుస్తోంది.. ఓ మహిళ డాగ్ వాకింగ్ వ్యాపారం ప్రారంభించి నెలకు లక్షల రూపాయలు సంపాదిస్తోంది. కేవలం మూడు నెలల్లోనే ఆమె కంపెనీ టర్నోవర్ రూ. 50 లక్షలు దాటింది. వివరాల్లోకి వెళితే…
మీడియా నివేదికల ప్రకారం.., నార్విచ్‌లో నివసించే 28 ఏళ్ల గ్రేస్ బట్టరీ కాఫీ కేఫ్‌లో బారిస్టాగా పనిచేస్తున్నారు. ఇక్కడ ఆమె కాఫీ తయారు చేస్తోంది. అందుకోసం ఆమె గంటల తరబడి కేఫ్‌లోనే పని చేయాల్సి వచ్చింది. డబ్బులు కూడా అంతంత మాత్రంగానే వచ్చేవట. అయితే, వెన్నకి కుక్కలంటే చాలా ఇష్టం. ఒకరోజు ఆమె స్నేహితురాలు ఒకరు మీరు కుక్కల్ని నడిపించటంలో మంచి నిపుణురాలివి.. వాటిని ఎందుకు తిప్పకూడదు..? అని అడిగారట. ఇక అంతే.. ఇక్కడి నుండి బట్టర్‌కి ఒక ఆలోచన వచ్చింది. ఆమె వెంటనే కేఫేలో ఉద్యోగం మానేసింది. ఈ సంఘటన 2019 నాటిదిగా తెలిసింది. ఆ తర్వాత గ్రేస్ బట్టెరీ ఒక కంపెనీని ప్రారంభించింది. ఆమె దాని ద్వారా కుక్కలను వాకింగ్ కోసం తీసుకెళ్లటం మొదలు పెట్టింది.
అలా ఆమె ప్రతిరోజూ ఆరు గంటల పాటు వాటిని నడిపిస్తుంది. బదులుగా ఆమెకు ఆ కుక్కల యజమానులు డబ్బు చెల్లిస్తారు. మొదట్లో ఆమెకు నలుగురు కస్టమర్లు మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆమెకు వందల మంది కస్టమర్లు ఉన్నారు. ఆమె స్వయంగా 36 కుక్కలను వాకింగ్ కోసం బయటకు తీసుకువెల్తుంది.. దీని ద్వారా ఆమె ప్రతి సంవత్సరం 42 వేల పౌండ్లు అంటే సుమారు 44 లక్షల రూపాయలు సంపాదిస్తుంది. అన్ని ఖర్చులు పోనూ.. ఆమెకు ఏడాదికి 34 లక్షల రూపాయలు ఆదా అయ్యాయి.
ఏదైనా కంపెనీ లేదా దుకాణం వంటి ఇతర వ్యాపారాల్లో పెద్ద మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుంది. నెలనెలా నిర్వహణ ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అద్దె, కరెంట్, గ్యాస్ వంటి ఖర్చులు తప్పని సరి. కానీ తాను చేసే పనికి.. ఇవేమీ అవసరం లేదని చెబుతోంది గ్రేస్ బట్టరీ. తనకు కేవలం పెట్రోల్‌కు మాత్రమే డబ్బులు ఖర్చవుతాయని తెలిపింది. కస్టమర్ల ఇంటికి వెళ్లి..డాగ్‌కు వాకింగ్ చేయించి.. తిరిగి ఇంటికి వస్తానని పేర్కొంది. అయితే, ఈ డ్యూటీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెప్పింది.. కానీ మీ పనిని ప్రేమిస్తే ఆ సమస్యలు పెద్దగా ఇబ్బంది కాదని చెబుతోంది. తాను ఎప్పుడూ జంతువులను ప్రేమిస్తానని.. ముఖ్యంగా కుక్కలంటే తనకు ఎంతో ఇష్టమని వెల్లడించింది. ఇష్టమైన కుక్కలతో ఇష్టమైన పనిచేస్తూ.. బాగా డబ్బులు సంపాదించడం ఆనందంగా ఉందని ఎంతో హ్యాపీగా చెబుతోంది బట్టరీ.
ప్రస్తుతం గ్రేస్ బట్టరీ చేస్తున్న పనికి సంబంధించిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వందలాది మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. మరీ ముఖ్యంగా, ఆమె తన పెంపుడు జంతువులతో రోజుకు ఆరు గంటల పాటు వాకింగ్ చేయటం వల్ల లక్షలు సంపాదించే అవకాశం ఉందని తెలిసి నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..