ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది. అలాంటివి మనకు అరుదుగా తారసపడుతుంటాయి. ప్రతిభకు లోటు లేని వారు...
Ad
Worker Dance Video
Follow us on
ట్యాలెంట్ (Talent) ఏ ఒక్కరి సొత్తూ కాదు. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ట్యాలెంట్ ఉంటుంది. పైకి కనిపించేందుకు సాధారాణంగా ఉన్నా వారిలో అసమాన ప్రతిభ ఉండే అవకాశం ఉంది. అలాంటివి మనకు అరుదుగా తారసపడుతుంటాయి. ప్రతిభకు లోటు లేని వారు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఉన్నారు. కానీ వారు తమ ట్యాలెంట్ ను నిరూపించుకోవడానికి అవసరమైన ప్లాట్‌ఫామ్ లేకపోవడం వల్ల వారు నిర్లక్ష్యానికి గురవుతున్నారు. అయితే.. సోషల్ మీడియా (Social Media) వచ్చిన తర్వాత అలాంటి వాళ్లకు వేదిక దొరికింది. దీని సహాయంతో తమ ప్రతిభను చూపుతూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్నారు. సోషల్ మీడియాలో డ్యాన్స్ కు సంబంధించిన వీడియోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ కార్మికుడు తాము పనిచేసే పరికరంతో బ్రేక్ డ్యాన్స్ చేస్తున్నాడు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లకూ ఏ మాత్రం తగ్గని ట్యాలెంట్ అతనిది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
Break dance during the break on a Hubei construction site???
ఒకప్పుడు పాటలు పాడినా, డ్యాన్స్ చేసినా పెద్దగా పట్టించుకోని ప్రజలు, మారుతున్న కాలంతో పాటు దీని క్రేజ్ బాగా పెరిగిపోయింది, అందుకే ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వస్తే అది వేగంగా వైరల్ అవుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో కొంతమంది కూలీలు నిర్మాణ స్థలంలో కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తాడు. అతని మూమెంట్స్ చాలా అందంగా ఉన్నాయి. అతని అద్భుత ప్రదర్శన చూసిన తోటి కూలీలూ ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టారు.