Know This: చంద్రుడిపైకి వెళ్లనున్న బుల్లెట్‌ ట్రైన్‌.. ఈ రైల్లో ఎవరైనా ఎక్కొచ్చు.! పూర్తి వివరాలు..

Know This: చంద్రుడిపైకి వెళ్లనున్న బుల్లెట్‌ ట్రైన్‌.. ఈ రైల్లో ఎవరైనా ఎక్కొచ్చు.! పూర్తి వివరాలు..

Anil kumar poka

|

Updated on: Jul 22, 2022 | 8:24 AM

ఎర్త్‌ ఎండ్‌..! దీనిపై ఎన్నో థియరీలు మరెన్నో భయాందోళనలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ.. భూగోళాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితే ఎదురైతే.. మనిషి గతేంటి.? ఎక్కడికి పోవాలి.? ఎలా పోవాలి.?


ఎర్త్‌ ఎండ్‌..! దీనిపై ఎన్నో థియరీలు మరెన్నో భయాందోళనలు తెరపైకి వస్తున్నాయి. ఒకవేళ.. భూగోళాన్ని ఖాళీ చేయాల్సిన పరిస్థితే ఎదురైతే.. మనిషి గతేంటి.? ఎక్కడికి పోవాలి.? ఎలా పోవాలి.? మానవ జాతి ఇక్కడే అంతమైపోతుందా? ఇకపై అలాంటి భయాలేవీ అక్కర్లేదంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు. భూలోకం కాకపోతే మనిషికి మరో కొత్త లోకం రెడీ చేయబోతున్నట్లు ప్రకటించారు జపాన్‌ సైంటిస్టులు. అది కూడా జాబిల్లిపైన. అవును మీరు విన్నది నిజమే.. మానవుడి కలలు నిజమయ్యేలా.. సైంటిస్టులు పలు పరిశోధనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జపాన్‌ ప్రభుత్వం చంద్రుడి మీదకు వెళ్లే ఓ బుల్లెట్‌ ట్రైన్‌ను రెడీ చేస్తోంది. ఇది ఒక ఆర్టిఫిషియల్‌ స్పేస్‌ ఆర్బిట్‌గా ఉండబోతుందంటా. మానవులు మరొక గ్రహానికి వెళ్లాలనే కల నెరవేరనుంది. భూమి నుంచి చంద్రునిపైకి జపాన్ బుల్లెట్ రైలును నడపనుంది. ఇది విజయవంతమైతే అంగారకుడిపైకి కూడా నడిపే యోచనలో ఉంది. అక్కడ దిగేందుకు, బస చేసేందుకు క్యాప్సూల్‌ నిర్మించేందుకు బ్లూప్రింట్‌ కూడా సిద్దం చేస్తుంది. ప్రజలను బుల్లెట్ రైలులో భూమి నుండి మూన్ పైకి తీసుకెళ్లాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఇది విజయవంతం అయితే అంగారకుడిపైకి కూడా రైలు నడుపుతుందట.

జపాన్‌ పరిశోధకులు ఇటీవల భూమి, చంద్రుడు, అంగారక గ్రహాలను కలిపే కృత్రిమ అంతరిక్ష నివాసంను రెడీ చేస్తోంది. అంతేకాదు.. ఇక్కడికి వెళ్లేందుకు ఓ ట్రైన్‌ను కూడా రెడీ చేస్తోంది. మన జీవించే విధంగా చంద్రునిపై ఈ గ్లాస్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. చంద్రునిపై ఉన్న దానిని “లూనాగ్లాస్” అని, అంగారక గ్రహంపై ఉండే ఆవాసాన్ని “మార్స్‌గ్లాస్” అని పిలుస్తారు. దీనిని 2050 నాటికి పూర్తి చేయాలనకుంటున్నారు. క్యోటో యూనివర్సిటీ, కజిమా కన్‌స్ట్రక్షన్‌లు కలిసి ఈ మెగా ప్రాజెక్ట్‌లో పాలుపంచుకోనున్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Published on: Jul 22, 2022 08:24 AM