Video Viral: బోనులోనే ఉంది కదా అని షేక్ హ్యాండ్ ఇవ్వబోయాడు.. తర్వాత సింహం ఇచ్చిన ట్విస్ట్ చూసి షేక్ అయ్యాడు
మీరెప్పుడైనా జూ (Zoo) పార్క్ కు వెళ్లారా.. రకరకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలు, పచ్చదనంలో ప్రశాంతత ఇవన్నీ మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. జంతువులను చూడగానే చిన్నారులు సంతోషంతో కేరింతలు..
మీరెప్పుడైనా జూ (Zoo) పార్క్ కు వెళ్లారా.. రకరకాల జంతువులు, పక్షుల కిలకిలరావాలు, పచ్చదనంలో ప్రశాంతత ఇవన్నీ మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. జంతువులను చూడగానే చిన్నారులు సంతోషంతో కేరింతలు కొడుతుంటారు. గట్టిగా అరుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. అయితే కొందరు మాత్రం తుంటరి పనులు చేస్తుంటారు. పంజరంలోని (Cage) జంతువులను ఆటపట్టించడానికి ప్రయత్నిస్తుంటారు. పెద్ద పెద్ద బోర్డుల ద్వారా జంతువులకు దూరంగా ఉండాలని హెచ్చరికలు ఏర్పాటు చేసినా కొందరు మాత్రం వాటికి విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. వాటిని ఆటపట్టించబోయే వారు ప్రమాదానికు గురవుతుంటారు. ప్రస్తుతానికి అలాంటి షాకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి ఏం చేయాలో తెలియక సింహం బోనులో చేయి వేశాడు. వెంటనే సింహం ఆ చేయిని నోటితో పట్టుకుంటుంది. ఈ ప్రమాదాన్ని ఊహించని ఆ వ్యక్తి.. నొప్పితో విలవిల్లాడిపోతాడు. సింహం బారి నుంచి చేతిని విడిపించుకోవడానికి తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు. అతని పక్కనే ఉన్న వారు కూడా సింహానికి భయపడి సహాయం చేయకపోవడాన్ని వీడియోలో చూడవచ్చు. కానీ కొంత సమయం తర్వాత అతని చేతిని సింహం వదిలేసింది.
ఇవి కూడా చదవండిView this post on Instagram
వైరల్‌గా మారిన ఈ వీడియో కొన్ని సెకన్లు మాత్రమే. కానీ ఇది చూసిన తర్వాత ఇలాంటి తుంటరి పనులు చేయకూడదని కచ్చితంగా అనిపిస్తుంది. ఈ క్లిప్ వీడియో ఎర్త్ రీల్ అనే ఖాతాతో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఇప్పటి వరకు వందలాది మంది వీడియోను లైక్ చేస్తున్నప్పటికీ చాలా మంది యూజర్లు వీడియో చూసి షాక్ అవుతున్నారు. మూర్ఖత్వానికి పరిమితి ఉంది అని, చేసిన తప్పుకు శిక్షించాల్సిందే అని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి