Viral Video: గుక్కెడు నీళ్ళకోసం అల్లాడి.. చివరికి రోడ్డుపైనే కుప్పకూలి.. కలచివేస్తున్న వీడియో

భూమిపై నివసించే సమస్త ప్రాణకోటికి నీరు అత్యంతావశ్యకం. ప్రతి జీవికీ నీటి అవసరం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. వేసవిలో (Summer) చుక్క నీరూ దొరకక అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోతుంటాయి. తాజాగా ఓ గుర్రం వేసవి తాపాన్ని తాళలేక...

Viral Video: గుక్కెడు నీళ్ళకోసం అల్లాడి.. చివరికి రోడ్డుపైనే కుప్పకూలి.. కలచివేస్తున్న వీడియో
Horse Video Viral

Updated on: Aug 13, 2022 | 5:27 PM

భూమిపై నివసించే సమస్త ప్రాణకోటికి నీరు అత్యంతావశ్యకం. ప్రతి జీవికీ నీటి అవసరం ఎంతగా ఉందో అందరికీ తెలిసిందే. వేసవిలో (Summer) చుక్క నీరూ దొరకక అనేక మూగజీవులు ప్రాణాలు కోల్పోతుంటాయి. తాజాగా ఓ గుర్రం వేసవి తాపాన్ని తాళలేక బండిని లాగుతూనే కుప్పకూలిపోయింది. అమెరికాలోని న్యూయార్క్‌ లో జరిగిన ఈ ఘటన హృదయాలను కలచివేస్తుంది. న్యూయార్క్ (New York) లోని మాన్‌హట్టన్ హెల్స్ కిచెన్ ప్రాంతంలో క్యారేజ్ లాగుతున్న రైడర్ అనే గుర్రం ఉన్నట్టుండి కిందపడిపోయింది. దానిని పైకి లేపేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. స్థానికులు వెంటనే అప్రమత్తమై పశువుల వైద్యుల్ని, పోలీసులకు సమాచారం అందించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అశ్వదళం యూనిట్ వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎండ వేడిని తట్టుకోలేక రోడ్డుపై పడిపోయిన ఆ గుర్రానికి చికిత్స అందించారు. పైపులతో నీటిని వెదజల్లారు. కొంత సమయం తర్వాత ఆ గుర్రం కోలుకుని పైకి లేచింది. పోలీసులు దానిని గుర్రపుశాలకు తరలించారు. పశు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..