కస్టమర్ ప్రాణాలు కాపాడిన మహిళా వెయిటర్.. ఆమె సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్న నెటిజన్లు..

|

Oct 15, 2022 | 6:51 AM

ఆహారం తినే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సార్లు ఆహారం గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుంటారు...

కస్టమర్ ప్రాణాలు కాపాడిన మహిళా వెయిటర్.. ఆమె సమయస్ఫూర్తికి ఫిదా అవుతున్న నెటిజన్లు..
Waiter Video
Follow us on

ఆహారం తినే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సార్లు ఆహారం గొంతులో ఇరుక్కుపోయి తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. అయితే చాలా మంది భోజనం చేసే సమయంలో మధ్యమధ్యలో నీళ్లు తాగుతుంటారు. ఇలా చేస్తే గొంతులో ఫుడ్ ఇరుక్కోకుండా సజావుగా జీర్ణాశయంలోకి వెళ్తుందని చెబుతుంటారు. మాట్లాడుతూ భోజనం చేయడం, సరిగ్గా నమలకుండా మింగడం.. కారణం ఏదైనా ఆహారం గొంతులో ఇరుక్కోవడం చాలా బాధ కలిగిస్తుంది. శ్వాస అందక, ముద్ద దిగక విలవిల్లాడిపోతుంటారు. ఏదో ఒక సమయంలో మనందరికీ ఇలాంటి ఘటన అనుభవమే. ఆహారం తినే సమయంలో చిన్న ముక్క మాత్రమే గొంతులో ఇరుక్కుపోయి ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం చాలాసార్లు జరుగుతుంది. ఆహారం లేదా నీరు గొంతులో ఇరుక్కున్న తర్వాత శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలో, వైద్యుడి వద్దకు వెళ్లడం అవసరం. డాక్టర్ వద్దకు తీసుకెళ్లేంత సమయం లేకుంటే.. కొన్ని టిప్స్ పాటించి ఈ సమస్య నుంచి బాధితుడిని సురక్షితంగా బయటపడేయవచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు ఆశ్చర్యపోవడమే కాకుండా ఆమె చేసిన పనిని కచ్చితంగా మెచ్చుకుంటారు.

వైరల్ అవుతున్న క్లిప్ లో నలుగురు వ్యక్తులు డిన్నర్ టేబుల్ వద్ద కూర్చుని భోజనం చేస్తుంటారు. ఇంతలో ఒక వ్యక్తి గొంతులో ఆహారం ఇరుక్కుపోతుంది. అతని పక్కన కూర్చున్న ఒక అబ్బాయి అతని వీపును తట్టడాన్ని చూడవచ్చు. ఇంతలో ఒక మహిళా వెయిటర్ అక్కడికి చేరుకుంటుంది. విషయం తెలుసుకుని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇరుక్కున్న ఆహారాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్తుంది. ఒక చిన్న ప్రయత్నం తర్వాత ఆమె చివరకు ఇందులో విజయం సాధించి కస్టమర్ ప్రాణాలను కాపాడుతుంది.

ఇవి కూడా చదవండి

మహిళా వెయిటర్ పేరు లేసీ గప్టిల్ అని చెబుతున్నారు. ఆమె చాలా సంవత్సరాల క్రితమే ఈ ట్రిక్ నేర్చుకున్నాట్లు తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. దీనిని ఇప్పటివరకు 1.8 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. 1 లక్ష 20 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. లేడీ వెయిటర్ చూపిన సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.