Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video Viral: ఏడుస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లిన చింపాంజీ.. చేతులు పట్టుకుని అది చేసిన పనికి నెటిజన్లు ఫిదా

సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ చేరువైంది. చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు. గంటలకు గంటలు సమయమే తెలియకుండా గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్...

Video Viral: ఏడుస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లిన చింపాంజీ.. చేతులు పట్టుకుని అది చేసిన పనికి నెటిజన్లు ఫిదా
Chimpanzee Video Viral
Follow us
Ganesh Mudavath

|

Updated on: Sep 02, 2022 | 7:54 AM

సోషల్ మీడియా (Social Media) ప్రతి ఒక్కరికీ చేరువైంది. చేతిలో సెల్ ఫోన్, అందులో డేటా ఉంటే చాలు. గంటలకు గంటలు సమయమే తెలియకుండా గడిపేస్తున్నారు. సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు అప్ లోడ్ అవుతుంటాయి. వాటిలో జంతువులకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకర్షిస్తాయి. వాటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. వీటిలో ముందు వరసలో చింపాంజీలకు సంబంధించిన వీడియోలు ఉంటాయి. ఎందుకంటే చింపాంజీలకు, మనుషులకు మధ్య పోలికలు చాలా ఉన్నాయి. వాటి జన్యువులు, మనుషుల జన్యువులు ఒకే రకంగా ఉంటాయని పలు పరిశోధనల్లోనూ తేలింది. అవి చేసే ఏ పని అయినా వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటి వీడియో (Video) ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. బాధలో ఉన్న సమయంలో ఎవరైనా ఓదార్చడమో లేక మన బాధను ఎవరికైనా చెప్పుకోవాలని అనిపించడం సహజం. ఈ వీడియోలో ఒక వ్యక్తి విచారంగా ఉన్నప్పుడు అతని వద్ద అతని వద్దకు ఒక చింపాంజీ వస్తుంది. అది ఆ వ్యక్తిని ఓదారుస్తుంది. మొదటగా అతని వద్దకు వచ్చి, అతని భుజం తడుతుంది. చివరలో చింపాంజీ అతన్ని కౌగిలించుకుంటుంది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Limbani (@limbanizwf)

సోషల్ మీడియోల వైరల్ అవుతున్న ఈ వీడియో.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు రెండు మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వేల సంఖ్యలో లైక్స్ వస్తున్నాయి. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మనుషుల్లో మానవత్వం లేకున్నా జంతువుల్లో మానవత్వం ఇంకా మిగిలే ఉందని, చింపాంజీలు చాలా తెలివైనవని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఈ వీడియోకు నెటిజన్ల నుంచి విపరీతంగా లైక్స్ వస్తున్నాయి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి