Trending Video: అమ్మను కొట్టొద్దు నాన్నా.. చిన్నారి క్యూట్ వార్నింగ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..

పిల్లలు భగవంతుని స్వరూపం అనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్నారులు చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. మంచి ఏది.. చెడు ఏది అనే విషయాలు వారికి తెలియవు. అందరినీ ఒకే విధంగా చూస్తారు. కలిసిమెలిసి ఆడుకుంటారు. మాట్లాడుకుంటారు...

Trending Video: అమ్మను కొట్టొద్దు నాన్నా.. చిన్నారి క్యూట్ వార్నింగ్.. ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు..
Girl Trending Video

Updated on: Feb 27, 2023 | 1:47 PM

పిల్లలు భగవంతుని స్వరూపం అనే విషయం మనందరికీ తెలిసిందే. చిన్నారులు చాలా స్వచ్ఛమైన మనసుతో ఉంటారు. మంచి ఏది.. చెడు ఏది అనే విషయాలు వారికి తెలియవు. అందరినీ ఒకే విధంగా చూస్తారు. కలిసిమెలిసి ఆడుకుంటారు. మాట్లాడుకుంటారు. చాలా వరకు చిన్నారులు వారి తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. వారు ఏది చేస్తే అదే చేయడాన్ని ఇష్టపడతారు. కాబట్టి చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వారి ముందు కొట్టుకోవడం, తిట్టుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేయడం ద్వారా చిన్న వయసులోనే వారి మనసులో విష బీజాలు నాటుకుపోతాయి. పిల్లలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతానికి అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్ లో తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. ఓ వ్యక్తి తన కూతురిని సరదాగా ఆటపట్టించడాన్ని చూడవచ్చు. అతను తన భార్యను కూతురి ముందే కొడతాడు. అది చూసిన ఆ చిన్నారి తన తండ్రిని అలా చేయవద్దని వారిస్తుంది. అయినా అతను మాత్రం తన పద్ధతి మార్చుకోకుండా మరో సారి తన భార్యను కొట్టాడు. దీంతో తీవ్ర కోపంతో ఆ చిన్నారి తన తండ్రి చెంపపై గట్టిగా కొడుతుంది. తల్లిదండ్రులకు ఇది తమాషాగా అనిపించినా.. ఆ చిన్నారి కళ్లల్లో మాత్రం కోపం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వీడియో చూశాక చిన్నారుల ముందు జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన రాకమానదు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. కొద్ది గంటల క్రితం అప్‌లోడ్ చేసిన ఈ వీడియోను 5 వేల మందికి పైగా లైక్ చేయగా, చాలా మంది తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..