రైలు (Train) పట్టాలు దాటే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొందరు రైల్వే గేట్లు మూసి ఉన్నా మూర్ఖంగా ప్రవర్తిస్తుంటారు. గేట్లను దాటడం, పై నుంచి దూకడం వంటి ప్రమాదకర చర్యలకు పాల్పడుతుంటారు. కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోతుంటారు. అందుకే రైల్వే గేట్లు వద్ద, పట్టాలు దాటే సమయంలో అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు, నిపుణులు అవగాహన కలిగిస్తుంటాయి. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. మూర్ఖంగా వ్యవహరిస్తూ ప్రాణాలు కోల్పోతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో (Social Media) చాలానే ఉన్నాయి. కొన్నిసార్లు రైలు రాక ముందే పట్టాల మీదుగా వెళ్లే వారు కూడా ప్రమాదాలకు గురవుతుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ (Viral) గా మారింది. ఈ వీడియోలో రైలు పట్టాలు దాటేందుకు రైల్వే గేట్ లేదు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన కారుతో పట్టాలు దాటేందుకు ప్రయత్నిస్తాడు. అయితే అనుకోకుండా కారు ఇరుక్కుపోతుంది. కారు డ్రైవర్ ఎలాగైనా కారును అక్కడి నుంచి బయటకు తీసుకురావాలని తీవ్రంగా ప్రయత్నించాడు. కానీ అది సాధ్యం కాలేదు. దాంతో అతను వెంటనే అప్రమత్తమై కారు నుంచి దిగి వెళ్లిపోతాడు. అదే సమయంలో అక్కడికి ఓ రైలు వేగంగా దూసుకొస్తుంది. అంతే క్షణాల్లో కారును ముక్కలుముక్కలుగా చేసేస్తుంది.
Why are you there in the first place? ? pic.twitter.com/FeDTmMIO3S
ఇవి కూడా చదవండి— Vicious Videos (@ViciousVideos) September 1, 2022
ఒళ్లు గగుర్పొడిచే ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ అయింది. 19 సెకన్ల ఈ వీడియోకు ఇప్పటివరకు 13 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. వందలాది మంది వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా వీడియో చూసిన తర్వాత నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇది మూర్ఖత్వం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ రైలు పట్టాలు దాటేటప్పుడు గానీ, రైల్వే గేట్ల వద్ద అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయం ఈ వీడియో చూశాక అర్థమవుతోంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..