Viral Video: ఊసరవెల్లినే మించిపోయిందిగా.. రంగులు మార్చడంతో నాకు నేనే పోటీ అంటున్న పక్షి

జంతువులన్నింటిలో ఊసరవెల్లి రంగులు మారుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, పరిసరాల ప్రభావంతో పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ ఉంటాయి. అయితే ఊసరవెల్లులే కాకుండా రంగులు....

Viral Video: ఊసరవెల్లినే మించిపోయిందిగా.. రంగులు మార్చడంతో నాకు నేనే పోటీ అంటున్న పక్షి
Bird Changing Colors
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 26, 2022 | 2:44 PM

జంతువులన్నింటిలో ఊసరవెల్లి రంగులు మారుస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. శత్రువుల నుంచి తనను తాను కాపాడుకోవడానికి, పరిసరాల ప్రభావంతో పరిస్థితులను బట్టి రంగులు మారుస్తూ ఉంటాయి. అయితే ఊసరవెల్లులే కాకుండా రంగులు మార్చే జీవులు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం ఓ పక్షి రంగు మారుస్తున్న వీడియో సోషల్ మీడియాలో (Social Media) వైరల్ అవుతోంది. ఈ వీడియో (Video Viral) చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా పక్షులకు ఒకటే రంగు ఉంటుంది. కొన్ని పక్షులు వివిధ రంగుల్లో ఉంటాయి. కానీ ఊసరవెల్లిలా రంగు మార్చే పక్షులు అరుదుగా ఉంటాయి. అలాంటి ఓ పక్షి వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక చిన్న పక్షి.. రెప్పపాటులో ఎన్నో రంగులను మారుస్తుంది. కొన్నిసార్లు లేత ఎరుపు, ఆకుపచ్చ, నలుపు రంగుల్లో మారుతుంది. ఆ పక్షి ఓ వ్యక్తి బొటన వేలిపై కూర్చుని అనేక రంగులను మారుస్తుంది. హమ్మింగ్‌బర్డ్ ప్రపంచంలోనే అతి చిన్న పక్షి.

ఊసరవెల్లిలా రంగు మారుస్తున్న హమ్మింగ్ బర్డ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం ఒక నిమిషం నిడివిగల ఈ వీడియోను ఇప్పటివరకు 2.8 మిలియన్లు అంటే 28 లక్షల వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. ఈ వీడియోకు ఇప్పటివరకు 95 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. అద్భుతమైన జీవి. లైటింగ్ అనేది మానవులకు కూడా సర్వస్వం అని కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం  ఈ లింక్ క్లిక్ చేయండి