Watch Video: అమ్మో బాబోయ్ ఇలా ఎలా ?.. డిప్లోమా డిగ్రీ పట్టా అందుకున్న శునకం.. వీడియో వైరల్

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడం మాములే. ఎప్పుడైన శునకం కూడా డిగ్రీ పట్టాను అందుకోవడం ఎప్పుడేనా చూశారా. తాజాగా అలాంటిదే అమెరికాలో జరిగింది. తన యజమానితో పాటు ఆ కుక్క డిగ్రీ పట్టా అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Watch Video: అమ్మో బాబోయ్ ఇలా ఎలా ?.. డిప్లోమా డిగ్రీ పట్టా అందుకున్న శునకం.. వీడియో వైరల్
Dog

Edited By:

Updated on: May 27, 2023 | 10:16 PM

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడం మాములే. ఎప్పుడైన శునకం కూడా డిగ్రీ పట్టాను అందుకోవడం ఎప్పుడేనా చూశారా. తాజాగా అలాంటిదే అమెరికాలో జరిగింది. తన యజమానితో పాటు ఆ కుక్క డిగ్రీ పట్టా అందుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాల్లోకెళ్తే..యూఎస్‌లోని న్యూజెర్సీలోని సెటన్‌ హాల్‌ యూనివర్సిటీలో జోసెఫ్ నైర్ గ్రేస్ మరియాని అనే అమ్మాయి తన డిగ్రీ పూర్తి చేసింది. దీంతో గ్రాడ్యుయేషన్‌ వేడుకలో ఆమెకు డిప్లొమా డిగ్రీని యూనివర్శిటీ యాజమాన్యం ప్రదానం చేశారు. అయితే ఆమెకు సహాయంగా ఉండే  జస్టీన్ అనే శునకం కూడా ప్రతీ తరగతికి క్రమం తప్పకుండా హాజరయ్యేది.

దీంతో ఈ శూనకం అంకితభావాన్ని ఆ యూనివర్శిటీ గుర్తించింది. ఇది చాలా అరుదైన విషయం అంటూ ప్రశంసిస్తూ ఆ కుక్కకు కూడా డిగ్రీ పట్టాను బహుకరిచారు. మరోవైపు ఆ యజమాని మరియా కూడా తన కుక్క సహచర్యంతోనే ప్రాథమిక పాఠశాలలో భోదించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటీజన్లు తమ భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..