Video Viral: ట్యాలెంట్ కు అక్కర్లేదు వయసు.. ఈ పెద్దాయన డ్యాన్స్ చూస్తే ఎగిరి గంతేయాల్సిందే..

ట్యాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. టైమ్ వచ్చినప్పుడు అది కచ్చితంగా బయటపడుతుంది. అది చిన్నపిల్లలే కావచ్చు. లేక పెద్దవారే కావచ్చు. అంతే కాకుండా ట్యాలెంట్ ను నిరూపించుకునేందుకు వయసుతో...

Video Viral: ట్యాలెంట్ కు అక్కర్లేదు వయసు.. ఈ పెద్దాయన డ్యాన్స్ చూస్తే ఎగిరి గంతేయాల్సిందే..
Dance Video Viral

Updated on: Dec 17, 2022 | 7:46 AM

ట్యాలెంట్ అనేది ఏ ఒక్కరి సొత్తూ కాదు. టైమ్ వచ్చినప్పుడు అది కచ్చితంగా బయటపడుతుంది. అది చిన్నపిల్లలే కావచ్చు. లేక పెద్దవారే కావచ్చు. అంతే కాకుండా ట్యాలెంట్ ను నిరూపించుకునేందుకు వయసుతో సంబంధం లేదు. చిన్నారులు వయసుకు మించిన పనులు చేసి ఆశ్చర్యపరుస్తుంటే.. పెద్దవాళ్లు వయసు మళ్లాక తమ లోని కళను బయటపెడుతూ విస్మయపరుస్తుంటారు. అయితే వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య అని మాత్రమే నిరూపించే ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. సీనియర్ సిటిజెన్లు డ్యాన్స్ చేయడం, పాటలు పాడటం వంటి ఘటనలు మనం చూసే ఉన్నాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చాలానే ఉన్నాయి. అంతే కాకుండా వీటిని చూసేందుకు నెటిజన్లు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి.. అద్భుతంగా డ్యాన్స్ చేయడాన్ని చూడవచ్చు. వయసులో పెద్దవాడే కానీ.. ట్యాలెంట్ లో యువకుడే అన్న విషయాన్ని నిరూపితం చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించారు. ఆయన వేసిన స్టెప్పులు చూస్తుంటే వయసు అడ్డు కాదనే విషయం తెలుస్తోంది. ‘యార్ మేరా తిత్లియాన్ వర్గా…’ అనే సూపర్‌హిట్ పంజాబీ పాటకు చేసిన ఈ డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్యాన్స్, ఎక్స్‌ప్రెషన్స్ సూపరో సూపర్ అంతే.

ఇవి కూడా చదవండి

వీడియోని ఒకటి కంటే ఎక్కువసార్లు చూస్తారు మరియు మీ స్నేహితులు మరియు బంధువులతో ఖచ్చితంగా షేర్ చేస్తారు.
ఈ వీడియో ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ అయింది. ఈ వీడియోకు ఇప్పటి వరకు నాలుగు లక్షలకు పైగా లైక్స్, లక్షల వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. డ్యాన్స్ మూవ్ మెంట్ చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు. వీడియో ను ఒకటి కంటే ఎక్కువ సార్లు చూడాలనే ఫీలింగ్ కలుగుతోందని చెబుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం