Hyderabad: రెండు ఇడ్లీల ధర రూ. 1200.. ఏంటీ బంగారంతో చేస్తారంటారా.?

| Edited By: Narender Vaitla

Jul 20, 2023 | 5:21 PM

24 క్యారెట్స్ గోల్డ్ తెలుసు.. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? ఎస్.. హైదరాబాద్ నగరంలో గోల్డ్ ఇడ్లీ ఇప్పుడు హాటాపిక్గా మారింది. అసలు ఈ ఇడ్లీని ఎలా తయారుచేస్తారు? దీని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం. అన్నీ దేశాలతో పోలిస్తే మనోళ్లు భోజన ప్రియులు.. మనసారా నవ్వడం. కడుపు నిండా తినడం మన వాళ్లకు పుట్టుకతో వచ్చిన అలవాటు. మన దేశంలోని ఒక్కో..

Hyderabad: రెండు ఇడ్లీల ధర రూ. 1200.. ఏంటీ బంగారంతో చేస్తారంటారా.?
Gold Idli
Follow us on

24 క్యారెట్స్ గోల్డ్ తెలుసు.. కానీ ఈ గోల్డ్ ఇడ్లీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా.? ఎస్.. హైదరాబాద్ నగరంలో గోల్డ్ ఇడ్లీ ఇప్పుడు హాటాపిక్గా మారింది. అసలు ఈ ఇడ్లీని ఎలా తయారుచేస్తారు? దీని ధర ఎంతో ఇప్పుడు చూద్దాం. అన్నీ దేశాలతో పోలిస్తే మనోళ్లు భోజన ప్రియులు.. మనసారా నవ్వడం. కడుపు నిండా తినడం మన వాళ్లకు పుట్టుకతో వచ్చిన అలవాటు. మన దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ఫుడ్ ఫేమస్. ప్రజల రుచిని, అభిరుచిని దృష్టిలో పెట్టుకుని వివిధ రెస్టారెంట్లు విభిన్నమైన ఆహారాలను, ఆఫర్స్‌ను అందిస్తూ, వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.

మీరు కూడా కొత్త రకం ఆహారాన్ని ఎంజాయ్‌ చేస్తారా.? మీలాంటి వారి కోసమే హైదరాబాద్‌లో కొత్త రకం డిష్ అందుబాటులోకి వచ్చింది. స్పెషల్‌ ఇడ్లీ భాగ్య నగర ప్రజలను ఊరిస్తోంది. ఇడ్లీలో ప్రత్యేకత ఏముందనేగా మీ సందేహం. అది అలాంటిలాంటి ఇడ్లీ కాదు. రెండు ఇడ్లీలు ఏకంగా రూ. 1200. అంత ధర ఏంటీ.? ఏమైనా బంగారంతో చేస్తారనేగా మీ సందేహం. అవును నిజమే ఆ ఇడ్లీలను బంగారంతోనే చేశారు.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్‌లోని ఓ హోటల్లో గోల్డ్ పూత పూసిన ఇడ్లీలను విక్రయిస్తున్నారు. ఈ కేఫ్ లో ఇడ్లీలే కాదు.. బంగారు దోశ, గులాబ్ జామూన్ బజ్జీ, మల్లె ఖోవా గులాబ్ జామూన్ లాంటి నోరూరించే స్పెషల్ ఐటెమ్స్ అందుబాటులో ఉన్నాయి. బిర్యానీ పేరును ఖండాంతరాలు వ్యాపింపజేసిన హైదరాబాద్ లిస్టులో కొత్తగా యాడ్ అయిన ఈ ఐటెమ్స్ ని తినడానికి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే ఇది సామాన్యులకు అందుబాటులో లేని ధర కావడంతో ధనవంతులు ఆ హోటల్‌కి క్యూ కడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..