పాత సిలింగ్‌ ఫ్యాన్‌ కోసం రూ.50లక్షలు..! అయినా దక్కని అవకాశం.. కారణం ఏంటంటే..

సుమారు 150 ఏళ్ల నాటి ఓ పాత సిలింగ్‌ ఫ్యాన్‌ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ సీలింగ్ ఫ్యాన్ కొనేందుకు ప్రజలు లక్షల రూపాయలు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. దీంతో ఇప్పుడు ఇంటర్‌లో పాత సీలింగ్‌ ఫ్యాన్‌ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఆ ఫ్యాన్‌ స్పెషలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాత సిలింగ్‌ ఫ్యాన్‌ కోసం రూ.50లక్షలు..! అయినా దక్కని అవకాశం.. కారణం ఏంటంటే..
Old Antique Fan

Updated on: Dec 08, 2024 | 8:04 PM

గుజరాత్‌లోని భరూచ్ నుండి ఒక పాత సిలింగ్‌ఫ్యాన్ వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. అందులో మీరు పాత ఫ్యాన్‌ని చూడవచ్చు. భరూచ్‌లోని ఒక పార్సీ ఇంట్లో అమర్చిన ఈ ఫ్యాన్ 150 ఏళ్ల నాటిదని ఈ వీడియోల్లో పేర్కొన్నారు. అయితే, 150ఏళ్ల పాత ఫ్యాన్ కావడం ఇక్కడ విశేషం కాదు..కానీ, పాత వస్తువులు కొనుగోలు చేస్తూ, విక్రయించే వ్యాపారి ఒకరు ఈ పాత ఫ్యాన్ కోసం లక్షల రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నందున ఇది వైరల్ అవుతోంది. ఈ పురాతన ఫ్యాన్‌ వీడియోను NewsX ద్వారా షేర్ చేయబడింది.

ఇది కేవలం సాధారణ పాత ఫ్యాన్‌ మాత్రమే. కానీ ఒక పాత వస్తువుల డీలర్ దానిని కొనుగోలు చేయడానికి రూ. 50 లక్షలు ఆఫర్ చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ఇంత భారీ ఆఫర్ ఇచ్చిన తర్వాత కూడా ఈ సీలింగ్ ఫ్యాన్‌ను విక్రయించేందుకు దాని యజమాని నిరాకరించాడు. ఎందుకంటే.. ఇది సాంస్కృతిక, భావోద్వేగ విలువలు అనేక కలిగి ఉన్నదని, ఇది అతనికి విలువైన వారసత్వ సంపదగా అతడు భావిస్తున్నాడు. అరుదైన, పార్సీ వారసత్వానికి ఉన్న అనుబంధం కారణంగా ఇది ఒక విలువైన వస్తువు అని యజమాని నమ్మకం. ఈ ఫ్యాన్‌ యజమాని దానిని తమ భవిష్యత్ తరాల కోసం భద్రపరచాలని కోరుకుంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోకు ఇప్పటివరకు 558000 వీక్షణలు,18000 కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి. అంతే కాకుండా ఈ వీడియోపై చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు అడిగారు పురాతన డీలర్ ఎవరు? నేనే యాంటిక్ కలెక్టర్‌ని కావడం వల్ల భావోద్వేగాలు ఏమిటో నాకు తెలుసు అని రాశారు. అలాంటి వస్తువుల ముందు డబ్బుకు విలువ లేదని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..