Viral Video: అందరి జీవితంలో పెళ్లికి ఎక్కడ లేని ప్రాధాన్యత ఉంటుంది. ఇష్టమైన వారితో వందేళ్లు గడపడానికి వేసే మూడు ముళ్ల బంధం కోసం ఎదురు చూస్తుంటారు. వివాహ వేడుకను కూడా అంగరంగవైభంగా జరుపుకోవాలని ఆశపడుతుంటారు. ఈ క్రమంలోనే పాటలు, డ్యాన్స్‌లతో హోరెత్తిస్తుంటారు. ఇటీవలి కాలంలో వివాహ వేడుకల్లో చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పెళ్లి కూతురు డ్యాన్స్, పెళ్లి కొడుకు ధరించిన డ్రస్ ఇలా ప్రతీ అంశం ట్రెండింగ్ మారుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ వివాహా వేడుకలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఓ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఆ ఆనంద క్షణాన్ని మరింత ఆనందంగా మార్చుకునే క్రమంలో కొత్త జంట కలిసి డ్యాన్స్ చేస్తున్నారు. పెళ్లి కూతురు చేయి పట్టుకొని రెండు స్టెప్పులు వేశాడో లేదో.. ఆ తర్వాత నవ వధువు భర్త చేతుల్లో వాలిపోయేందుకు ప్రయత్నించింది. అయితే వేసుకున్న డ్రస్ సహకరించలేదో, లేదా కాలు జారిందో కానీ.. పెళ్లి కూతురు కింద పడిపోయింది. దీంతో బ్యాలెన్స్ కంట్రోల్ చేయలేని పెళ్లి కొడుకు కూడా వధువుతో సహా పడిపోయాడు. దీనంతటినీ అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు.. ప్రేమలో పడిపోవడం అంటే ఇదేనేమో అంటుంటే, మరికొందరు పెళ్లి కొడుకు బరువు పెరగడానికి ఒక ట్రెయినర్‌ను నియమించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. మరి నెట్టింట నవ్వులు పూయిస్తోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
Also Read: Priyanka Gandhi: ఆ చిన్నారి మాటలకు ప్రియాంక ‘ఫిదా’ …ఇంతకీ ఆ చిన్నారి ఏమందంటే..
Mukku Avinash Marriage: ఓ ఇంటివాడైన ముక్కు అవినాష్.. నెట్టంట వైరల్‌గా మారిన ఫోటోలు