రోజురోజుకి సాంకేతికత అభివృద్ధి చెందుతుంటే మరోవైపు మోసాలు కూడా ఎక్కవవుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఓ చోట అనేక మోసాలు బయటపడుతున్నాయి. అమాయకులను ఎరగా వేసుకొని దుండగులు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా చైనాలో ఓ వింత మోసం వెలుగులోకి వచ్చింది. ఓ హెయిర్ కటింగ్ షాప్‌కు వెళ్లిన వ్యక్తి రూ.230 బదులు.. రూ.1.15 లక్షలు చెల్లించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే బీజింగ్‌లో లీ అనే వ్యక్తి ఉంటున్నాడు. అయితే అతనికి తన స్నేహితుడు ఓ హెయిర్ సెలూన్ చెందిన రూ.230 గిఫ్ట్ కార్డు ఇచ్చాడు. దీంతో లీ హెయిర్ కటింగ్ కోసం ఆ గిఫ్ట్ కార్డును వినియోగించుకునేందుకు ఆ సెలూన్‌కు వెళ్లాడు. గిఫ్ట్ కార్డు చూపించగానే సెలూన్ నిర్వాహకులు లీ కి మసాజ్ చేశారు.
ఆ తర్వాత అతని ముఖానికి లోషన్ పూశారు. ఆ లోషన్ బాటిల్ ఖరీదు రూ.4,582గా ఉంటుందని చెప్పారు. అలాగే మరిన్ని డిస్కౌండ్‌ల కోసం ఆ సెలున్ షాప్ మేనేజర్ మరో గిఫ్ట్ కార్టు కొనాలంటూ లీ ని ప్రోత్సహించాడు . దీనికి అంగీకరించిన లీ రూ.57,571 ఖరీదైన మరో గిఫ్ట్ కార్డును కొన్నాడు. అయితే లీ కి హెయిర్ కట్ చేసే ముందు సెలూన్ సేవలకు సంబంధించిన బిల్‌ను ఆ షాప్ నిర్వాహకులు చూపించారు. కానీ కళ్లద్దాలు పెట్టుకోనందున లీ దాన్ని సరిగా చూడలేకపోయారు. ఆ తర్వాత లీకి వివిధ రకాల హెయిర్ కటింగ్ ప్రొడక్ట్స్‌ని అప్లై చేశారు. కటింగ్ అయిపోయాక చివరికి రూ.1.15 లక్షల బిల్లును అతని ముందు పెట్టారు.
ఈ మొత్తాన్ని కట్టాలంటూ చెప్పారు. చివరికి లీ తాను మోసపోయాననే విషయాన్ని గ్రహించాడు. తన వద్ద డబ్బులు లేవని చెప్పాడు. అయినా కూడా అతడ్ని సెల్‌ఫోన్ ద్వారా లోన్‌కు అప్లై చేసేలా సెలున్ నిర్వాహకులు ఒత్తిడి చేశారు. ఇక చేసేదేమీ లేక లీ లోన్ ద్వారా ఆ మొత్తాన్ని చెల్లించాడు. ఆ తర్వాత తనకు జరిగిన మోసాన్ని లీ ఓ స్థానిక టీవీ ఛానల్‌కు తెలియజేశాడు. తన డబ్బులు తిరిగి ఇప్పించేలా చేయాలంటూ కోరాడు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి ఆ సెలూన్ మూసిఉన్నట్లు పలు నివేదికలు తెలిపాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.