Viral Video: నచ్చిన పని చేయడం, నచ్చని పని చేయకపోవడం.. మనిషికి నిజమైన స్వాతంత్ర్యం ఉందని చెప్పడానికి ఇదే కీలకం. మనకు నచ్చలేని పనిని ఎవరు చేయమన్నా, చేయడానికి ఆసక్తి చూపించం. అలాగే నచ్చని వస్తువును ఇచ్చినా, నచ్చని ఆహారాన్ని తీసుకోమన్నా పక్కకు వెళుతాం. అది ఎంత రుచికరమైన ఆహారమైనా సరే తినాలనే ఆసక్తి లేకపోతే అస్సలు దాని వైపు కూడా చూడం. మరి ఇలాంటి మనో భావాలు, అత్మ గౌరవాలు కేవలం మనుషులకే ఉంటాయా. మూగ జీవాలకు ఉండవా అంటే.. ఎందుకు ఉండవు మాకు ఉంటాయని చెబుతోంది ఓ వానరం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ వీడియోనే దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది.
వివరాల్లోకి వెళితే.. కొందరు వ్యక్తులు జూ పార్క్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే బోనులో ఉన్న ఓ కోతికి అరటి పండును తినిపించడానికి ప్రయత్నించారు. అయితే ఆ వానరం మాత్రం నాకు వద్దు అన్నట్లు స్పందించలేదు. అయితే సదరు వ్యక్తి మాత్రం దానికి బలవంతంగా తినిపించడానికి ప్రయత్నించాడు. ఇదే సమయంలో దీనిని అక్కడే ఉన్న మరో వ్యక్తి ఫోన్‌లో చిత్రీకరిస్తున్నాడు. కోతికి నచ్చకపోయినప్పటికీ బలవంతంగా తినిపిస్తుండడంతో చిర్రెత్తుకు పోయిన వానరం కోపంతో ఒక్కసారి ఫోన్‌ను కిందపడేసింది.
అయితే అప్పటికీ కూడా బలవంతంగా అరటిని తినిపించడానికి ప్రయత్నించడంతో అరటిని కూడా కింద పడేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు కోతికి బలవంతంగా అరటిని తినిపించడానికి ప్రయత్నించిన వారిని తప్పు పడుతూ కామెంట్లు చేశారు. నెట్టింట వైరల్ అవుతోన్న ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
If “Keep playing with me” was an animal ??? pic.twitter.com/D844JHoMmV
— Hood Comedy (@HoodComedyEnt) October 11, 2021
Also Read: Viral Video: కిడ్నాపర్లకు పోలీస్ చుక్కలు.. రన్నింగ్ కారుపై దూకి హీరోలా వెంటాడిన పోలీస్.. వీడియో