Watch Video: నిమజ్జనం చేయొద్దని గుక్కపెట్టి ఏడుస్తున్న చిన్నారుల.. హృదయాలను కదిలిస్తున్న వీడియో!
వినాయక చవితి వస్తుందంటే అందరూ ఎంత సంతోషిస్తారో.. నవరాత్రి ఉత్సవాల తర్వాత జరిగే నిమజ్జనం రోజూ అంతకు రెట్టింపుతో భావోద్వేగానికి గురవుతారు. ఎందుకంటే తొమ్మిది రోజులు పాటు ఎంతో భక్తిశ్రద్ధలతో కొలుసుకున్న బొజ్జ గణపయ్య తమను వదిలి వెళ్లడం అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో ఓ చిన్నారి గణపయ్య విగ్రహాన్ని నిమజ్జనం చేయనివ్వకుండా కౌగిలించుకొని ఏడవడం అందరీ గుండెలను కదిలించింది.

దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో గత ఐదు రోజులుగా పూజలందుకున్న గణనాథులను భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. బ్యాండ్ బాజాలు, డీజేలతో డ్యాన్సులు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి.. గణేషుడికి వీడ్కోలు పలుకుతున్నారు. ఈ నిమజ్జనాల సందర్భంగా చాలా ప్రాంతాల్లో కొన్ని భావోద్వేగమైన సంఘటన చోటుచేసుకుంటున్నాయి. చిన్నారులు గణపయ్య విగ్రహాలను నిమజ్జనం చేయడానికి ఇష్టపడట్లేదు. తమకు ఇష్టమైన గణనాథుడిని నీటిలో వేయొద్దంటూ అడ్డుకుంటున్నారు. విగ్రహాన్ని కౌగిలించుకొని బోరున ఏడుస్తున్నారు.
తల్లిదండ్రులు ఎంత నచ్చజెప్పినా.. చిన్నారులు మాత్రం గణపయ్యను వదిలేందుకు ఇష్టపడట్లేరు. ఇలాంటి ఘటన దేశవ్యాప్తంగా చాలా జరిగాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరూ.. ఆ బుజ్జి గణపయ్యపై చిన్నారులు చూపుతున్న ప్రేమను చూసి వారు కూడా భావోద్వేగానికి గురవుతున్నారు.
వీడియో చూడండి..
View this post on Instagram
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
