Dog Viral Video: కుక్కలకు, మనుషులకు మధ్య ఏదో తెలియని ప్రత్యేక అనుబంధం ఉంది. కుక్కలు మనుషులకు అత్యంత విశ్వాసపాత్రులుగా ఉంటాయి. తమ యజమానికి అన్నివిధాలుగా కుక్కలు అండగా ఉంటాయి. వారికి ఏమైనా ఆపద వాటిల్లితే.. వెంటనే రెస్పాండ్ అవుతుంటాయి. ఇదంతా ఇప్పటి వరకు మనం చూసిన కొన్ని కుక్కలను ఆధారంగా చెప్పుకుంటున్నాం. కానీ ఈ కుక్కను చూస్తే మాత్రం ఈ అభిప్రాయం పూర్తిగా తప్పని డిసైడ్ అవుతారు. కుక్కల్లోనూ కొన్ని అసూయ భావన కలిగి ఉంటాయని కూడా ఫిక్స్ అయిపోతారు. ఇక్కడ కుక్క చేసిన పనికి కడుపుబ్బా నవ్వుతారు.
తాజాగా ఓ పెంపుడు కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూస్తే మాత్రం పడి పడి నవ్వుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇంతకీ ఈ వీడియో అంతలా ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి తన పెంపుడు కుక్క పిల్లలను హెచ్చరిస్తుంటాడు. ఆ కుక్కలు ఏది పడితే అది తినకుండా బెదిరింపులకు పాల్పడుతాడు. వాటికి అర్థం అవ్వడం కోసం.. అతను ఓ వస్తువును కొరుకుతూ చూపిస్తాడు. అలా చేస్తే కొడతాననని హెచ్చిరస్తూ తనకు తాను చెప్పు తీసుకుని కొట్టుకుంటాడు. అయితే, అతని వెనకాలే ఉన్న ఆ తల్లి కుక్క.. అతన్ని కొట్టుకోకుండా అడ్డుకుంటుంది. అతని చేతిలోని చెప్పును తీసుకెళ్తుంది. అయితే, ఇప్పటి వరకు అదిన చూసిన వారు కుక్క ఎంత మంచిదో అని భావిస్తుంటారు. కానీ, అంతలోనే ఆ కుక్క ఊహించని ట్విస్ట్ ఇస్తుంది. చెప్పుకు బదులుగా ఓ పెద్ద కర్రను తీసుకువస్తుంది. చెప్పుతో కాకుండా.. ఈ కర్రతో కొట్టుకో అన్నట్లుగా అతనికి ఇస్తుంది. ఆ కుక్క క్రేజీ పనికి యజమాని షాక్ అవుతాడు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రమ్ ఖాతా ‘animals dose’ లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. కుక్క టైమింగ్‌కి ఫిదా అయిపోయారు. ఎంతో సరదాగా ఉన్న ఈ వీడియోను మీరూ చూసేయండి మరి.
Also read:
Kurnool District News: విత్తనాలు వేయకముందే ఆ రైతు పంట పండింది.. ఏకంగా రూ. 30 లక్షల వజ్రం దొరికింది