Viral Video: బాధలో ఉన్న వ్యక్తికి ఓదార్పునిస్తే.. వారు ఆ పరిస్థితి నుంచి బయటపడతారు. లేదంటే.. లోలోపల కుమిలిపోతూ.. మరింత డిప్రెషన్‌కు లోనవుతారు. అది సమస్యను మరింత జఠిలం చేస్తుంది. అయితే, ప్రస్తుత కాలంలో ఎవరిని విశ్వసించాలో, విశ్వసించకూడదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. నమ్మిన వారే నట్టేట ముంచే కాలం ఇది. అందుకే.. చాలా మంది మనుషులను నమ్మడం కంటే.. జంతువులను నమ్మడం బెటర్ అని భావిస్తున్నారు. పెంపుడు జంతువులను తెచ్చుకుని వాటిని సాకుతున్నారు కూడా. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయానికి నిదర్శనమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. నిజంగానే మనుషులను నమ్మడం కంటే.. ఒక మూగ జీవిని సాదుకోవడం ఉత్తమం అని అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే.. ఆ వీడియోలో తీవ్ర బాధతో ఓ వ్యక్తి కన్నీరు పెడుతుండగా.. పెంపుడు పిల్లి వచ్చి ఓదార్చింది. అతని కన్నీటిని తుడిచి.. హత్తుకుంది.
@buitengebieden పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. బాధలో ఏడుస్తున్న వ్యక్తిని పెంపుడు పిల్లి తానున్నానంటూ ఓదారుస్తుంది. కంట నీరు తుడిచి.. తన చేతులతో అతన్ని హత్తుకుంటుంది. అతను కూడా పిల్లి ఓదార్పుకు కరిగిపోతాడు. దానిని తన గుండెలకు హత్తుకుని రిలాక్స్ అవుతాడు. ఈ వీడియో చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. మనుషులను నమ్మడం కంటే మూగ జీవాలను నమ్మడం ఉత్తమం అని పేర్కొంటున్నారు. కష్ట సమయంలో తోడుగా నిలిచిన ఈ పిల్లికి సెల్యూట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈవీడియోకు ఇప్పటి వరకు 11 మీలియన్లకు పైగా వ్యూస్ రాగా, 4 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి.
Please don’t cry.. ? pic.twitter.com/OLPCs4frHd
— Buitengebieden (@buitengebieden) July 31, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..