Viral Video: తొండంతో నీరు తాగడానికి ప్రయత్నిస్తున్న బుల్లి ఏనుగు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Viral Video: చిన్న పిల్లలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటుంది. తెలిసి తెలియని వయసులో వారు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ భలే ఉంటాయి. పిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే సమయంలో..

Viral Video: తొండంతో నీరు తాగడానికి ప్రయత్నిస్తున్న బుల్లి ఏనుగు.. నవ్వులు పూయిస్తోన్న వీడియో..

Updated on: Aug 14, 2022 | 7:40 PM

Viral Video: చిన్న పిల్లలు చేసే పనులు నవ్వు తెప్పిస్తుంటాయి. తెలిసి తెలియని వయసులో వారు మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ భలే ఉంటాయి. పిల్లలు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకునే సమయంలో వారి హావభావాలు, చేష్టలు ఎంతటివారినైనా మెస్మరైజ్‌ చేస్తాయి. అయితే ఇది కేవలం మనుషులకే పరిమితమా అంటే.. నెట్టింట వైరల్‌ అవుతోన్న ఓ వీడియో కాదని సమాధానం చెబుతోంది. ఓ బుల్లి ఏనుగు పిల్ల చేసిన పని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఓ బుల్లి ఏనుగు పిల్ల తల్లితో కలిసి నీరు తాగడానికి నది ఒడ్డుకు వెళ్లింది. అప్పుడప్పుడే భూమిపైకి వచ్చిన జీవి కావడంతో దానికి తొండంతో నీరు ఎలా తాగాలో తెలియలేదు. దాంతో అచ్చంగా తల్లి ఏనుగును అనుకరిస్తూ నదిలోని నీరు తాగడానికి ప్రయత్నించింది. చిన్ని తొండాన్ని కిందికి, పైకి కదుపుతూ సందడి చేసింది. దీనంతటినీ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. బుల్లి ఏనుగు పిల్ల హావభావాలు నవ్వు తెప్పిస్తోంది. అచ్చంగా చిన్న పిల్లలు ఎలాగైతే పెద్దలను అనుకరిస్తారో అలాగే ఏనుగు పిల్ల తల్లిని ఫాలో అవుతూ తొండంతో నీరు తాగాలనే కొత్త విషయాన్ని తెలుసుకుంటోంది.

ఇక ఈ వీడియోను ఇలా పోస్ట్‌ చేశారో లేదో అలా వైరల్‌ అవుతోంది. కొద్దిసేపట్లోనే ఏకంగా 7 లక్షల మందికి పైగా వీక్షించగా వేలల్లో లైక్‌లు, కామెంట్ల వర్షం కురుస్తోంది. ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఆగస్టు 12న ఈ వీడియోను పోస్ట్‌ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..