Viral Video: విమానం కిందికి దూసుకెళ్ళిన కారు.. వెంట్రుకవాసి దూరంలో తప్పిపోవడం అంటే ఇదేనేమో..
ఢిల్లీ విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రత నడుమ రెప్ప పాటులో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం పాట్నాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు..
ఢిల్లీ విమానాశ్రంయలో కట్టుదిట్టమైన భద్రత నడుమ రెప్ప పాటులో పెను ప్రమాదం తప్పింది. ఇండిగో విమానం పాట్నాకు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. ఇంతలో గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన కారు.. విమానం కిందకు వెళ్లిపోయింది. వాస్తవానికి విమానం ముందు చక్రానికి ఢీ కొట్టిందేమోనని అక్కడ ఉన్న అధికారులు టెన్షన్‌తో ఊపిరి బిగబట్టి చూస్తున్నారు. ఐతే తృటిలో పెద్ద పెను ప్రమాదం తప్పింది.విమానానికి ఉన్న ముందు చక్రానికి వెంట్రుకవాసి దూరంలో ఈ కారు ఆగిపోయింది. ఈ ఘటనకు గల కారణాలు గురించి డీజీసీఏ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తుందని అధికారులు తెలిపారు. సదరు కారు డ్రైవర్ మద్యం సేవించి ఇలా ర్యాష్‌గా కారు నడిపాడేమోనని బ్రీత్ ఎనలైజర్ పరీక్ష కూడా నిర్వహించారు. ఐతే నెగిటివ్ వచ్చిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో విమానానికి ఎలాంటి నష్టం జరగలేదు, ఎవరూ గాయపడలేదు. ఐతే ఈ ఘటన పై ఇండిగో కానీ గో ఫస్ట్ గానీ స్పందించ లేదు. కానీ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో తెగ వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Girl letter to Modi: పెన్సిల్ అడిగితే అమ్మ కొడుతోంది.. దీనికి ధరల పెరుగుదలే కారణం కాదా..?
Viral Video: తప్పతాగి చిందులేస్తూ కుతకుత ఉడికే జావలో పడ్డాడు.. చివరకు జరిగింది ఇదే..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

