
శంభాజీనగర్‌లో జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెటిజన్లు ఎంతగానో ఆకర్షించింది. మహారాష్ట్రతో పాటుగా ఇంటర్‌నెట్ వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటోంది. ఇది ఒక వృద్ధ జంట ప్రేమను చూపించింది. వారి ప్రేమతో ఏకంగా ఓ నగల వ్యాపారిని కదిలించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోలో 93 ఏళ్ల వ్యక్తి తన భార్య కోసం మంగళసూత్రం కొనడానికి ఒక నగల దుకాణానికి వెళ్లాడు. అక్కడ ఏం జరిగిందో చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు..
మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక నగల దుకాణంలోకి సాంప్రదాయ తెల్లటి ధోతీ-కుర్తా, తలపై టోపీ ధరించిన 93 ఏళ్ల వృద్ధుడు అడుగుపెట్టాడు. అతడి అవతారం చూసిన జ్యూవెలర్ షాపు సిబ్బంది అతడు ఎవరో బిచ్చగాడు అనుకుని పొరపడ్డారు. ఆ వృద్ధుడు ఆర్థిక సాయం కోరుతూ వచ్చాడని అనుకున్నారు. కానీ, ఆ వ్యక్తి తన భార్య కోసం సాంప్రదాయ మంగళసూత్రం కొనాలని వచ్చినట్టుగా చెప్పాడు. అది విన్న షాప్ యజమాని, సహా అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అంతలోనే ఆ వృద్ధుడి భార్య కూడా దుకాణంలోకి ప్రవేశించింది. వారివురు ఒకరికొకరు అంకితభావంతో, ప్రేమతో దుకాణంలోకి వచ్చారు. అక్కడ వారు ఒక బంగారు మంగళసూత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే వారివురి మధ్య ప్రేమపూర్వక మాటలు, అప్యాయతను చూసిన దుకాణ యజమాని చలించిపోయి వారితో మాటలు కలిపాడు. ఆ వృద్ధ దంపతుల ప్రేమకు ముగ్ధుడైన దుకాణ యజమాని, అతని నుండి కేవలం 20 రూపాయలు తీసుకొని ఆ హారాన్ని అతనికి బహుమతిగా ఇచ్చాడు.
వీడియో ఇక్కడ చూడండి..
వృద్ధ జంట దుకాణంలోకి వచ్చినపుడు ఆ వ్యక్తి వద్ద కేవలం రూ. 1,120 లు ఉన్నాయి. వాటితో అతను తన భార్యకు మంగళసూత్రం కొనాలనుకుంటున్నానని చెప్పాడు. అతని కోరిక తనను ఆశ్చర్యపరిచిందని షాప్ యజమాని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. అతని నుండి ఆశీర్వాద చిహ్నంగా రూ. 20 తీసుకొని, ఆ మంగళసూత్రాన్ని వారికి ఇచ్చినట్టుగా చెప్పాడు. ప్రస్తుతం ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..