దీపావళి పండగ కోసం రైళ్లలో ప్రయాణాలు చేస్తున్నారా? అయితే పారాహుషార్. ఈ వారంరోజుల పాటు రైల్వేస్టేషన్లలో రద్దీ మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా రైల్వేస్టేషన్లలో దీపావళి రద్దీ నెలకొంది. సొంతూళ్లకు వెళ్లడానికి పోటెత్తిన ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే ముంబైలోని బాంద్రా రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగింది. ప్రమాదంలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలిసింది.
ఈ సంఘటన తెల్లవారుజామున 2.25 గంటల ప్రాంతంలో జరిగింది. బాంద్రా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (రైలు నంబర్ 22921) ముంబై రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే, ప్రజలు రైలు ఎక్కే ప్రయత్నంలో ఈ తొక్కిసలాట జరిగింది. బాంద్రా నుంచి యూపీలోని గోరఖ్‌పూర్ వెళుతున్న రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు చేరకున్నారు. స్టేషన్లో ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండటంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది.
ఈ వీడియోపై క్లిక్ చేయండి..
Stampede at Mumbai’s Bandra Terminus leaves 9 injured amid heavy rush
Injured passengers have been shifted to a hospital, said BMC.#Mumbai #bandra #stampede #injured #bandrastation #Maharashtra #BMC #Breaking pic.twitter.com/YuC578J6Ug
— mishikasingh (@mishika_singh) October 27, 2024
బాంద్రా (ఇ) ప్లాట్‌ఫారమ్ నంబర్ 1పై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ క్లిక్ చేయండి..