ఆదర్శ విద్యార్థి..! 72ఏళ్ల వయసులో గ్రాడ్యూయేషన్‌ పట్టా పొందిన వృద్ధుడు.. ఎదురుగా 98ఏళ్ల తల్లి

|

May 14, 2023 | 11:18 AM

కాలేజ్‌లో మొదట్లో నెర్వస్‌గా ఉండేదని, కానీ నేను దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాను. ఈ నా విద్యార్థి ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగింది. దీన్ని పూర్తి చేసినందుకు నేను గర్వపడుతున్నాను.. అంటూ చెప్పారు. ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్లను ఆదర్శంగా తీసుకుని నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేయగలం అంటున్నారు పలువురు నెటిజన్లు.

ఆదర్శ విద్యార్థి..! 72ఏళ్ల వయసులో గ్రాడ్యూయేషన్‌ పట్టా పొందిన వృద్ధుడు.. ఎదురుగా 98ఏళ్ల తల్లి
Man 72 Graduates
Follow us on

చదువుకు వయోపరిమితి లేదు. మనం ఏ వయసులోనైనా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. విద్య గురించి పెద్దలు చెప్పే ఈ మాటలు మనం తరచుగా వింటూ ఉంటాం. జార్జియాలో నివసించే 72 ఏళ్ల వృద్ధుడు అయిన సామ్ కప్లాన్ విద్యకు ఏ వయసు అడ్డంకి కాదని నిరూపించారు. జీవితంలో అలసిపోయిన వృద్ధ వయస్సులో అతను పట్టభద్రులయ్యారు. ఆసక్తికరంగా, సామ్ గ్రాడ్యుయేషన్ వేడుకకు అతని 98 ఏళ్ల తల్లి కూడా హాజరయ్యారు. ఈ ప్రత్యేక సందర్భంలో ఇద్దరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్ట్‌పై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు.

సామ్ కప్లాన్ జార్జియాలోని లారెన్స్‌విల్లేలో నివసిస్తున్నారు. అతను గ్విన్నెట్ కళాశాల నుండి సినిమా, మీడియా ఆర్ట్స్‌లో పట్టభద్రుడయ్యాడు. గురువారం ఆయన కాలేజీలో కాన్వొకేషన్ కార్యక్రమం ముగిసింది. తన తల్లితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో సామ్ కప్లాన్ పేరు చర్చనీయాంశమైంది. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, సామ్ మాట్లాడుతూ, “నేను నా మాధ్యమిక విద్యను 1969లో పూర్తి చేసాను. ఆ తర్వాత నా చదువు ఆగిపోయింది. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు రేడియోలో ఒక వార్త విన్నాను. అందులో ఓ కాలేజీ ప్రస్తావన వచ్చింది. ఈ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేయడానికి వయోపరిమితి లేదని రేడియోలో చెప్పారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత డిగ్రీ పొందాలని అప్పుడే నిర్ణయించుకున్నట్టుగా వివరించారు.

ఇవి కూడా చదవండి

ఇంకా అతను ఇలా అన్నాడు, మా కుటుంబంలో ఎవరూ గ్రాడ్యుయేట్ కాకపోవడం నాకు చాలా బాధ కలిగించింది. 2019లో నేను గ్విన్నెట్ కాలేజీలో చేరాను. నాలుగు సంవత్సరాల తర్వాత నాకు ఇష్టమైన సబ్జెక్ట్‌లో డిగ్రీ పట్టా పొందాను. నాకు చదవడం, రాయడం ఇష్టం. అందుకే చదువుకోవాలని నిర్ణయించుకున్నాను. కాలేజ్‌లో మొదట్లో నెర్వస్‌గా ఉండేది. కానీ నేను దీన్ని ఛాలెంజ్‌గా స్వీకరించాను. ఈ నా విద్యార్థి ప్రయాణం ఉత్కంఠభరితంగా సాగింది. దీన్ని పూర్తి చేసినందుకు నేను గర్వపడుతున్నాను. ” సామ్ కప్లాన్ ఈ కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీళ్లను ఆదర్శంగా తీసుకుని నిర్ణయం తీసుకుంటే ఏదైనా చేయగలం అంటున్నారు పలువురు నెటిజన్లు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..