ఓరీ దేవుడో ఇంత దారుణమా..? ఇంటి ముందు ఊడుస్తుండగా మింగేసిన మృత్యువు..! ఆ భయానక దృశ్యం..
గీతా కాలనీకి చెందిన 65 ఏళ్ల జానకి కుమారి తన ఇంటి ముందు ఊడ్చేందుకు బయటకు వెళ్లింది. సెకన్ల వ్యవధిలోనే అటుగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి మహిళను బలంగా ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీడియోలో మహిళ ఇంటి ముందు ఊడుస్తుండగా ఒక కారు వచ్చి మహిళను నేరుగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి.
సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా అది క్షణాల్లో ప్రజలకు చేరిపోతుంది. ప్రతిరోజూ మన మొబైల్‌లో అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మంచి వీడియోలు ఉంటే, మరి కొన్ని భయంకరమైనవి కనిపిస్తుంటాయి.. గత కొన్ని రోజులుగా ఘోర ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా అలాంటి వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వీడియోలో జరిగిన భయంకరమైన ప్రమాదాన్ని చూస్తే మీకు గూస్‌బంప్స్ వస్తుంది. ఇంటి ముందు ఊడుస్తున్న ఓ మహిళ ఊహించని ప్రమాదంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ షాకింగ్ యాక్సిడెంట్ సంఘటన మొత్తం సీసీటీవీలో రికార్డైంది. ఆ ఫుటేజీ ఇప్పుడు బయటకు వచ్చింది. వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది.
బుధవారం ఉదయం గీతా కాలనీకి చెందిన 65 ఏళ్ల జానకి కుమారి తన ఇంటి ముందు ఊడ్చేందుకు బయటకు వెళ్లింది. సెకన్ల వ్యవధిలోనే అటుగా వచ్చిన ఒక కారు అదుపు తప్పి మహిళను బలంగా ఢీకొట్టింది. దీని ప్రభావం తీవ్రంగా ఉండడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. వీడియోలో మహిళ ఇంటి ముందు ఊడుస్తుండగా ఒక కారు వచ్చి మహిళను నేరుగా ఢీకొట్టింది. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించాయి. అందులో మహిళ అమాంతంగా ఎగిరి కారు ముందు గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది.
A car driver hit an elderly woman who was sweeping outside her house in Delhi's Geeta Colony area. pic.twitter.com/He4jZdXjId
— Nikhil Choudhary (@NikhilCh_) March 20, 2024
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడు 25 ఏళ్ల ముకుల్ రాథోడ్‌ను అరెస్టు చేశారు. అతను బ్రేకులు కొట్టడానికి ప్రయత్నించాడని, అయితే యాక్సిలరేటర్ బటన్‌ను నొక్కాడని పోలీసు విచారణలో వెల్లడైంది. అదే ఈ ప్రమాదానికి కారణమైందని చెప్పారు. నిందితుడు ముకుల్ రాథోడ్ కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నాడని చెప్పారు. స్థానికులు, సంఘటన జరిగిన సమయంలో చూసిన ప్రత్యక్ష సాక్షుల స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేసిన తరువాత నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. రాథోడ్ ఘజియాబాద్‌లోని గ్రాఫిక్ డిజైనింగ్ సంస్థలో ఇంటర్న్‌గా పనిచేస్తున్నాడని, మృతురాలి ఇంటి పక్కనే నివసిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు మద్యం తాగి లేడని చెప్పారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..