అప్పుడప్పుడూ గాల్లో కరెన్సీ నోట్లు ఎగిరాయని.. రోడ్లపై కరెన్సీ నోట్ల కట్లు పడ్డాయన్న వార్తలను మనం వినే ఉంటాం. అయితే నీటిలో కరెన్సీ కట్టలు కొట్టుకురావడం మీరెప్పుడైనా చూశారా.? అలాంటి అనుభవం ఎదురైందా.? ఒకవేళ లేకపోతే ఈ స్టోరీ చదవండి..
రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో ఈ ఘటన జరిగింది. అనాసాగర్ సరస్సులో 2 వేల రూపాయల నోట్ల కట్టలు తేలియాడుతూ రావడం స్థానిక పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నోట్ల కట్టలు పాలిథీన్ బ్యాగులో ఉండటం.. ఆ సంచిలో సుమారు 30 నుంచి 32 నోట్ల కట్టలు ఉండగా.. అన్నీ 2వేల రూపాయల నోట్లే అని అధికారులు తెలిపారు. అలాగే వాటిన్నంటినీ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పుష్కర్రోడ్డులోని ఈ సరస్సులో భారీగా కరెన్సీ నోట్లు ఉన్నాయని తమకు సమాచారం అందిందని, వచ్చి చూస్తే నిజంగానే నోట్ల కట్టలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అయితే ఈ నోట్లు నకిలీవా? లేక నిజమైనవా? అనే విషయం తెలియాల్సి ఉందని చెప్పారు. చూడటానికి మాత్రం నిజమైన నోట్ల లాగే ఉన్నాయని, నీటిలో తడవడం వల్ల నిర్ధారించుకోలేకపోతున్నట్లు చెప్పారు. నిపుణుల సాయంతో నోట్లు అసలువో, కాదో తెలుసుకుంటామన్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నోట్లను సరస్సులో వదిలేశారని, దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు స్పష్టం చేశారు.
UNCLAIMED CASH FOUND IN AJMER
Unclaimed cash was found in #Ajmer‘s Anasagar Lake; police investigations are underway. pic.twitter.com/xlDhYnZ9tV— Mirror Now (@MirrorNow) May 6, 2022
Also Read: Viral Video: గర్ల్‌ఫ్రెండ్‌తో భర్త షికారు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య.. సీన్ కట్ చేస్తే.