Dubai dal fry video: వామ్మో..24క్యారెట్ల బంగారంతో చేసిన పప్పు.. గిన్నె ధర తెలిస్తే..

|

Jan 31, 2024 | 8:34 PM

24 క్యారెట్ల బంగారంతో పూత పూయబడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క గిన్నె పప్పు ధర రూ.25 వేల వరకు పలుకుతోంది. అయితే 10 గ్రాముల బంగారం 64 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ పప్పులో కనీసం రెండు-నాలుగు గ్రాముల బంగారాన్ని కలుపుతుండాలి అంటున్నారు పలువురు నెటిజన్లు.

Dubai dal fry video: వామ్మో..24క్యారెట్ల బంగారంతో చేసిన పప్పు.. గిన్నె ధర తెలిస్తే..
Dubai Dal Fry
Follow us on

24K Gold Dal Fry: మీరు చాలా హోటళ్లలో పప్పు, ఫ్రై వంటి విభిన్న రుచులను ఆస్వాదించి ఉంటారు. వివిధ దేశాలు, ఆయా రాష్ట్రాలు, అక్కడి ప్రాంతాలకు అనుగుణంగా పప్పుల రకాలు రుచిలో మారుతూ ఉంటాయి. కానీ మీరు 24 క్యారెట్ల బంగారు పూత పూసిన ‘డాల్ ఫ్రై’ని ఎప్పుడూ రుచి చూశారా..? బంగారు పూతతో దాల్‌ఫ్రై అని ఆశ్చర్యపోతున్నారు కదా..? ఈ ‘దాల్ ఫ్రై’ ఎక్కడ దొరుకుతుంది.? ఈ ప్రత్యేకమైన వంటకం ధర ఎంత? అని ఆరాటం మొదలైంది కదా.. ప్రస్తుతం ఈ డిష్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని పూర్తి వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ఈ వంటకాన్ని ’24 క్యారెట్ గోల్డ్ డాల్ ఫ్రై’ అంటారు. ఈ వంటకం దుబాయ్‌లో లభిస్తుంది. నిజానికి, ఇది మన అందరి ఇళ్లలో తయారుచేసే సాధారణ మినపప్పు. దానిపై మిరపకాయ మరియు ఆవాలు కలుపుతారు. అయితే ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ పప్పులో నూనె పోయలేదు. 24 క్యారెట్ల బంగారంతో పూత పూయబడింది. అందుతున్న సమాచారం ప్రకారం ఒక్క గిన్నె పప్పు ధర రూ.25 వేల వరకు పలుకుతోంది. అయితే 10 గ్రాముల బంగారం 64 వేల రూపాయలకు అమ్ముడవుతోంది. ఈ నేపథ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఈ పప్పులో కనీసం రెండు-నాలుగు గ్రాముల బంగారాన్ని కలుపుతుండాలి.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోను ఇప్పటి వరకు 14 లక్షల మందికి పైగా నెటిజన్లు వీక్షించగా దాదాపు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు మీరు ఇలాంటి డాల్ ఫ్రై ఎక్కడా తినలేదు. కాబట్టి, వీలైంతే ఒక్కసారి ట్రై చేయండి..

ఈ దాల్‌ఫ్రైకి సబంధించిన వీడియో mr.random4090 Instagram పేజీలో షేర్‌ చేయబడింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా, ఈ వీడియోకు రెండు లక్షలకు పైగా లైక్స్, వందలాది కామెంట్స్ వచ్చాయి. బంగారం ధరను పరిగణనలోకి తీసుకుంటే ఈ వంటకం ధర చాలా తక్కువగా ఉందని ఒక వినియోగదారు చెప్పారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..