స్విమ్మింగ్ మంచి వ్యాయామం. అయితే ఈత కొట్టడం అంత తేలికైన పని కాదు. ఒక వ్యక్తిలో సహజంగా రాదు. అయితే సాధన చేస్తే మాత్రం..స్విమ్మింగ్ చేయడం ఈజీనే. ఈత కొట్టడం నేర్చుకోవాలి. ఇలా నేర్చుకున్నా కొందరికి స్విమ్మింగ్ రానివారుంటారు. నేర్చుకోవడానికి నీటిలో కూడా చెమటలు కక్కుతారు. స్విమ్మింగ్ కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుందని మీకు తెలుసా? దీంతో శరీరంతో పాటు మనసుకు కూడా వ్యాయామం లభిస్తుంది. సరైన మార్గంలో ఈత కొట్టడం వల్ల మనిషికి ఒత్తిడి ఉండదు. అంతర్జాతీయ స్థాయిలో స్విమ్మింగ్ పోటీలు కూడా జరుగుతాయి. ప్రస్తుతం పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే కొంచెం వయసు వచ్చిన తర్వాత ఈత కొట్టడం అభ్యసిస్తారు. కానీ ఏడాదిన్నర వయసున్న చిన్నారి ఈత కొట్టడం ఎప్పుడైనా చూశారా? అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చూసిన వారిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఈ వీడియో..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో కేవలం 16 నెలల చిన్నారి స్విమ్మింగ్ పూల్‌లో ఆనందంగా ఈత కొడుతుంది. వాస్తవానికి నెలల పిల్లలు నడవడం, పరుగెత్తడం కూడా సరిగా నేర్చుకోలేని వయసు.. అటువంటిది ఆ వయసులో ఓ చిన్నారి ఈత కొడుతుండడం వినడానికి చాలా వింతగా అనిపించినా.. అదే దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. స్విమ్మింగ్ పూల్‌లో చిన్నారిని చూస్తుంటే అస్సలు చిన్నపిల్లలా అనిపించదు.. ఏదో స్విమ్మింగ్ ఎక్స్ పర్ట్ లా కనిపిస్తోంది. నీటిలో చేపలా ఈదుతూ.. నీళ్లలో స్నానం చేస్తున్నాడు. ఈ వీడియో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే సర్వసాధారణంగా ఇంత చిన్న బేబీ నీటిలో చేపలా ఈదడం ఎవరూ చూసి ఉండరు.. ఇప్పటి వరకూ..
స్విమ్మింగ్ చేస్తున్న శిశువు
16month old baby already knows how to swim, so unbelievable… pic.twitter.com/MGEkPyd9AV
— Extreme Videos (@impresivevideo) October 8, 2022
ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో @impressivevideo పేరుతో షేర్ చేయబడింది. ’16 నెలల పాపకు ఈత కొట్టడం తెలుసు. ఇన్క్రెడిబుల్’. ఈ 57 సెకన్ల వీడియోను ఇప్పటివరకు 24 వేలకు మందికి పైగా వీక్షించగా, వందలాది మంది వీడియోను కూడా లైక్ చేశారు.
అదే సమయంలో, వీడియో చూసిన తర్వాత వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. ‘ఈ నైపుణ్యం అందరిలోనూ ఉండాలి’ అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది అద్భుతంగా ఉందని మరొకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..