Watch: చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా… ఎలా బుసలు కొడుతుందో చూస్తే గుండె గుభేల్ మానాల్సిందే!

| Edited By: Ravi Kiran

Aug 12, 2024 | 11:30 PM

గ్రామంలో  12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. భారీ కింగ్ కోబ్రా ఎలాగో అడవినుంచి బైటకు వచ్చింది. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన భారీ సర్పం ఆ ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు. చూసేందుకు అతి భయంకరంగా కనిపిస్తూ.. అది చెట్టు మీద ఎక్కి కూర్చుని, బుసలు కొడుతుంది. వెంటనే స్థానికులు ఆ ఇంటి వారిని అప్రమత్తం చేశారు. మరోవైపు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించి పిలిపించారు.

Watch: చెట్టు మీద నక్కిన భారీ కింగ్ కోబ్రా... ఎలా బుసలు కొడుతుందో చూస్తే గుండె గుభేల్ మానాల్సిందే!
12 Foot King Cobra
Follow us on

సోషల్ మీడియాలో ప్రతిరోజూ అనేక వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో కొన్ని వీడియో ఫుటేజీలు మనలో భయాన్ని కలిగించేవిగా ఉంటే, మరికొన్ని కడుపుబ్బ నవ్వించేవిగా ఉంటాయి. అలాంటి వాటిల్లో పాములకు సంబంధించిన వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంటాయి. నెటిజన్లు కూడా వీటినిచూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కోవకు చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలో12 అడుగుల పొడవైన రాటిల్‌స్నేక్‌ను చూసి వీక్షకులు షాక్ అవుతున్నారు. ఈ భారీ కింగ్‌కోబ్రాను అతికష్టం మీద పట్టుకున్న స్నేక్‌క్యాచర్‌ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసలు కుమ్మరిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే…

కర్ణాటకలోని అగుంబే అడవికి సమీపంలోని ఓ గ్రామంలో  12 అడుగుల భారీ కింగ్‌ కోబ్రా కలకలం రేపింది. భారీ కింగ్ కోబ్రా ఎలాగో అడవినుంచి బైటకు వచ్చింది. రోడ్డుకు పక్కనే ఉన్న ఓ ఇంటి సమీపంలోకి వచ్చిన భారీ సర్పం ఆ ఇంటికి ఆనుకుని ఉన్న చెట్టుమీద ఎక్కి కూర్చుంది. అది గమనించిన స్థానికులు భయంతో వణికిపోయారు. చూసేందుకు అతి భయంకరంగా కనిపిస్తూ.. అది చెట్టు మీద ఎక్కి కూర్చుని, బుసలు కొడుతుంది. వెంటనే స్థానికులు ఆ ఇంటి వారిని అప్రమత్తం చేశారు. మరోవైపు స్నేక్‌ క్యాచర్‌కు సమాచారం అందించి పిలిపించారు. అటవీశాఖ అధికారులు, ఏఆర్‌ఆర్‌ఎస్‌ బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పామును పట్టుకుని సురక్షితంగా అడవిలోకి విడిచిపెట్టారు.

ఇవి కూడా చదవండి

వారం రోజుల క్రితం షేర్ చేసిన ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చాయి. నెటిజన్లు భారీ పామును చూసి షాక్ అయ్యారు. పామును రక్షించిన బృందం చేసిన పనిని ప్రశంసించారు. గంటల తరబడి కష్టపడి కింగ్ కోబ్రాను చెట్టు మీద నుంచి కిందకు దించారు. మెల్లగా దాన్ని ఒక సంచీలోకి వెళ్లేలా చేశారు. అనంతరం నివాసాలకు దూరంగా అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటన అంతటిని వీడియో తీశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు బాప్‌రే..ఎంత పెద్ద కింగ్ కోబ్రా.. అంటూ భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. దాన్ని చూస్తేనే భయంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..